headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-02 | February 2023 | ISSN: 2583-4797

5. ‘వొయినం’ నవలలో సామాజికగేయాల విశ్లేషణ

రంగ సాయికృష్ణ

పరిశోధక విద్యార్థి,
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు, తెలంగాణా
సెల్: +91 9666999343. Email: rng.saikrishna9@gmail.com

Download PDF


Keywords: నవల, దళితవాదం, గేయం, సామాజికత, జాజుల గౌరి, సాయికృష్ణ.

1. ఉపోద్ఘాతం:

వొయిన నవలను మట్టిమనిషి మనుబువ్వ రచయిత్రి జాజుల గౌరి రాశారు. తెలంగాణ దళిత నవల రాసిన మొట్టమొదటి మహిళా రచయిత్రి జాజుల గౌరి. తెలుగు సాహిత్యంలో తనదైన శైలితో కథలు, నవల రాసిన వ్యక్తి జాజుల గౌరి. తెలంగాణ దళిత మహిళ అస్తిత్వ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడంలో తనదైన పాత్రపోషించింది. ముఖ్యంగా నాగప్పగారి సుందర్రాజు గారి ప్రోత్సాహంతో దళిత మహిళా అస్తిత్వ కథలను రాసి రచయిత్రిగా మంచి గుర్తింపును పొందారు. ఆ తర్వాత బి.ఎస్‌ రాములు గారి ప్రోత్సాహంతో ఈ వొయినం నవలను ముద్రణ చేసి, అవార్డు కూడా కైవసం చేసుకుంది. ఈ నవలలో ప్రధానంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ఉండే దళితుల స్థితిగతులను వారి జీవన విధానాలను, సంస్కృతి, సంప్రదాయ అంశాలను కేంద్రంగా చేసుకుని రాసిన నవల వొయినం. ఇందులో ప్రధానంగా సామాజిక గేయాలను ఆయా సందర్భాలలో చక్కని ప్రయోగం చేసి ఈ నవలను ముందుకు నడిపారు.

2. వొయినం నవల సామాజికగేయాల విశ్లేషణ :

వొయినం నవలలో ప్రధానంగా కథను వివిధ సందర్భానుసారంగా వివిధ రకాల గేయాలతో  నవలను ముందుకు నడిపించి నవలకు ఎంతో సౌందర్యాన్ని చేకూర్చింది. వివిధ రకాల గేయాలు పాడుతూ కొన్ని పాత్రలను రసవంతంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా సామాన్య ప్రజల సుఖదుఃఖాలను అనుభూతుల వల్ల మనసు ఉద్వేగం చెందినప్పుడు, శ్రమలోని అలుపును మరచిపోవడానికి వివిధ  గేయాలను పాడుకుంటారు. ఈ నవలలో ముఖ్యంగా మనకు వివాహా సందర్భ గేయాలు, హాస్యగేయాలు, కరుణ రసాత్మక గేయాలు, బాంధవ్య గేయాలు,  వంటివి రచయిత్రి పాత్రలకు అనుగూణంగా గేయాలను పాడిస్తుంది. ఈ నవల చదువుతున్నంత సేపు ఒక దృశ్య కావ్యం లాగ అనిపిస్తుంది. ఇంకా చెప్పలంటే నవలలో దాదాపుగా గేయాలతో వివిధ రసానందాన్ని పొందవచ్చు. గేయం అనేది గ్రామీణ దళిత జీవనం ఎంచుకున్న ముడి సరుకులాంటిది. సమాజంలో దళితులు శ్రమజీవులు కాబట్టి ఆ శ్రమను మర్చిపోవడానికి గేయాన్ని ఎంచుకొని చేసే శ్రమను మర్చిపోతూ ఆహ్లాదకరంగా వారి జీవనాన్ని కొనసాగించేవారు.

2.1 వివాహగేయాలు:

నేడు వివాహ కార్యక్రమాలు అంటే కేవలం డి.జేలు బాక్స్‌లు. ఎంతటివారైనా వివాహ కార్యక్రమాలను రెండు రోజలలో పూర్తి చేస్తున్నారు. కాని ఆనాటి రోజులలో కనీసం తక్కవలో తక్కవ వారం రోజులు వివాహ వేడుకలు జరిగేవి. బంధాలు బంధుత్వాలతో అందరు కలిసిపోయేవారు. వివాహ ప్రతి సందర్భంలో కూడా ఆయా సందర్భానుసారంగా గేయాలు పాడుతూ ఎంతో ఆనందంగా గడిపేవారు. ఈ నవలలో నీలమ్మకు నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో కింది విధంగా గేయాలు పాడుతారు. ముందుగా మొగులయ్య నీలమ్మలకి తలపై నుంచి నీళ్ళు పోస్తూ ఇలా గేయం పాడుతుంది. నీలమ్మకు ఒడి బియ్యం పోసేటప్పుడు ఈ విధంగా పాటలు పాడుతారు.

      ‘‘సేరుసేరు ముతియాలు వొల్లెవేసుకో

      సేడేని పుట్నిల్లు బయలెల్లు సీతా

      సెడేని పుట్నిల్లు బయలోల్లు సీతా

      ఎడికేని కలిగెనమ్మ ఈ పెండ్లి కొడుకు        ‘‘ఎ’’

      ఈ సక్కాని లోకసుందరి జానకమ్మకు        ‘‘ఎ’’

      రెండు సేర్ల ముతియాలు వొల్లెపోసుకో

      సెడేనీ పుట్నిల్లు బయలెల్లు సీతా

      సేడేని పుల్నిల్లు బయలెల్లు సీతా

      ఎడికేని కలిగేనమ్మ ఈ పెండ్లి కొడుకు

      ఈ సక్కాని లోకసుందరి జానకమ్మకు

      మూడు సేర్ల ముతియాలు వొల్లో పోసుకో

అంటూ నీలమ్మకు వొడిబియ్యం పోసే సందర్భంలో ఈ విధంగా గేయం పాడి అలరించారు. ఇలా తెలంగాణలో గేయం పాటడం అనే సంస్కృతి ఉంది కాబట్టి రచయిత్రి ఇందులో సందర్భానుసారంగా పెట్టి నట్లు అర్థమవుతుంది.

      ‘‘ఎర్రగుంట నీళ్లు ఏయి కడువాలు

      పచ్చగుంట నీళ్ళు పది కడువాలు

      తోర్లియ్య తొలకొండ తొట్టి కావాలే

      ముంచి పొయ్య ముత్యాలా మంతాగావాలె

      కూర్చుండ గుర్జాల పీట గావాలే ‘‘కు’’

      ఆ నీళ్లు ఈ నీళ్లు కలరాసి వోసి

      పెయి తోమ పెద్దమామ బిడ్డ గావాలె

      ఎడ్ల బారం పోయి మొగిలయ్య రాంగ ‘‘ఎర్ర’’ (వొయినం : పుట: 37)

అంటూ స్నానం చేపించేటప్పుడు వలపు గేయాలు పాడుతారు.  కాబట్టి నలుగు వేసే వారి పేరు చెప్పి గేయాలను కొనసాగిస్తుంటారు. ఇక్కడ నీలమ్మ మొగలయ్య పెండ్లి వాతావరణంలో నులుగు వేసే సందర్భంలో వారికి సంబంధించిన అందరి పేర్లు తలుస్తూ గేయాన్ని కొనసాగించిన విధానం పైన చూడవచ్చు.

2.2 వ్యవసాయపు గేయాలు:

రచయిత్రి వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చింది కాబట్టి ఈ నవలలో వ్యవసాయ స్థితిగతులను కూడా తెలియజేసింది. నేడు ఈ సమాజం మొత్తం రైతు మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి నీలమ్మ వ్యవసాయం చేస్తున్న సందర్భంలో కొన్ని గేయాలను పాడుతు శ్రమను మర్చిపోయి జీవనం సాగిస్తుంటుంది.

      ‘‘అడుగు అడుగున నాకు అమ్మవైనట్ల

      అలసి సొలసి యాల నీడవైనట్ల

      జన్మంత నను మోసె నా నేలతల్లి

      ఈ మన్నులో మన్నై కలిసి పోతానే

      నీ చల్లని ఒడిలో నే ఒదిగిపోతానే’’  (వొయినం, పుట : 103)

ఎన్నో యేళ్ళుగా సాగు చేసుకున్న భూమి మరొకరు అన్యాయంగా లాక్కున్న సందర్భంలో  రైతు పడే వేదనకు రూపమే ఈ గేయం.

తనతో పాటు కోడలితో కూడా గేయాలు పాడిస్తుంది. వడ్లకు పోటు పెట్టడం అనేది వ్యవసాయపు ఇండ్లల్లో మనకు కనబడుతాయి. తన కోడలును చూస్తూ పోటు పాట ఇలా పాడుతుంది.

      ‘‘సోలపురం బోయినా

      సాలడొడ్లు దెచ్చినా

      హహ్హా నేను దంచా

      ఉహూ నేను దంచా

      దంచుకుంటే దంచకపోతివి

      చెరగనైన చెరగవే ఓ నా కోడలా

      హహూ నేను చెరగా

      ఉహూ నేనే చెరగా

      చెరగకుంటె చెరగపోతివి

      నేనైనా చెరుగుకంట

      బువైన ఒండవే ఓనా కోడలా

      హహూ నేనొండా

      ఊహూ నేనొండా

      ఒండకపోతే ఒకడకపోతివి.’’ ( పుట : 144)

ఆనాటి కాలంలో ఈరోజు ఉన్న రైస్‌ మిల్లులు లేవు కాబట్టి ఇంట్లో ఉన్నవారే వడ్లను దంచుకుని బియ్యంగా తయారుచేసుకొని అన్నం తినేవారు. అలా వడ్లను పోటేసేటప్పుడు అంటే దంచేటప్పుడు తన కోడల్ని మాట్లాడిస్తూ పాటల రూపంలో ఈ విధంగా సంభాషణ చేస్తుంటారు. అక్కడుంటే పరిస్థితులను చూసి అప్పటికప్పుడు గేయాన్ని అల్లుకుంటూ కొనసాగింపు చేసేవారు.

2.3 విసుర్రాయి గేయాలు:

గ్రామంలో సహజంగా దొరికే వాటితోనో పప్పు దినుసులను తయారు చేసుకునేవారు. ఇంట్లో ఉంటే ఆడవారందరు ఒక్క చోటుకు చేరి కుటుంబ పనులలో భాగమయ్యేవారు. వారి వారి ఇంటి కార్యక్రమాలకు సంబంధించి పప్పు దినుసు పట్టడంలోనూ శ్రమను మరిచిపోయి పాటలు పాడుతుంది నీలమ్మ. నీలమ్మ పసుపు విసిరే సమయంలో ఈ విధంగా గేయం పాడుతుంది.

      ‘‘అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో

      అల్లల్ల నేరడి అల్లనేరడి అల్లో నేరడల్లో

      అల్లానేరడి కింద సల్లని సెలిమే      ‘‘అల్లో నేరడల్లో’’

      సల్లాని సెలమే కింద ఎవ్వారి పోయి ‘‘అలో నేరడల్లో’’

      సల్లాని సెలమే కింద నీలమ్మ పోయి ‘‘అలో నేరడల్లో’’

      సల్లాని సెలిమే కింద మామిడి చెట్టు ‘‘అలో నేరడల్లో’’      (వొయినం, పుట : 25)

పెళ్లి సమయాలల్లో మామిడి చెట్టు ప్రాధాన్యతను గురించి తెలియజేసే పాట ఇది. మామిడి తోరణాలు, ఆకులు లేకుండా పెళ్ళి కార్యక్రమాలు ఏమి జరుగవు. కాబట్టి వివిధ సందర్భాలను తెలుపుతూ రచయిత్రి చక్కగా తెలిపింది.

2.4 ఉయ్యాల గేయాలు:

మనం చిన్నప్పటి నుండి వింటున్న పాట ఉయ్యాల పాట. దీనికి సాధారణంగా అంతం ఉండదు. ఉయ్యాల పాటలు పుట్టిన రోజు సందర్భంగా పాడుతూ ఉంటారు. తెలంగాణలో పురుడు, తొట్టెల వెయ్యడం, ఇరవై ఒక్కటి వంటి పదాలను ఉపయోగిస్తారు. ఈ నవలలో రచయిత్రి నీలమ్మ పాత్ర ద్వారా ఉయ్యాల పాట పాడుతుంది. నీలమ్మను మంచి గాయకురాలుగా కూడా చూపిస్తుంది రచయిత్రి.

      ‘‘జో జో శతనంద జో పాలకుందా

      రా రా పరమానంద లాలి గోవిందా జో జో

      ఊగుడు జెట్టుకు ఉయ్యల గట్టి

      ఉన్నుర్లు మీయమ్మ ఉల్లిగడ్డల దొంగా జో జో’’

      పల్లెల్ని మీ నాయినా పుట్నాల దొంగా జో జో

      పగిడియ్యి గిన్నెల్ల పాలాబోసి

      పాలు తాగదు లేవ్వు సిన్నికిష్టయ్య జో జో’’    (వొయినం, పుట : 86)

సాధారణంగా చిన్న పిల్లలు అన్నం తినడానికి మారం వేసినప్పుడు, వారు నిద్రపోవడానికి ఎడ్చినప్పుడు సాధారణంగా వారి తల్లులు ఉయ్యాల పాడుతూ వారిని సంతోషపెట్టడానికి నిద్రపుచ్చడానికి ఉయ్యాల పాటలు పాడుతుంటారు. ఇక్కడ నీలమ్మ తన కొడుక్కి బారసాల జరిగిప్పుడు పై పాటను నీలమ్మ పాడుతుంది.

2.5 జాతర గేయాలు:

గ్రామీణ వాతావరణంలో ఉన్న జాతర ప్రసస్తిని కూడా తెలియజేసింది రచయిత్రి ఈ నవలలో. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ఉన్న స్థితిగతుల జాతర విశేషాలను తెలుపుతూ జాతరల ప్రాముఖ్యతను తెలిపింది. శివరాత్రి పండుగ కోసం అందరు ఎడ్లబండి కట్టుకుని కీసర గుట్టకు వెలుతున్న సందర్భాన్ని ఈ విధంగా తెలిపింది.

      ‘‘తలపాగా జుట్టి

      చెర్నకోలా బట్టి

      కట్టు కట్టోయ్‌ బండి

      కాడెడ్ల బండి

      నువ్వు పదరో బావా

      కీసరగుట్ట జాతరకు’’ (వొయినం, పుట :74)

కీసరగుట్ట జాతరకు పోవడానికి తన బావతో ఎలా ఉండాలో చెబుతుంది మరదలు. తలకుపాగ కట్టుకోవాలని, చేతిలో చెర్నకోలా ఉండాలని, కాణికి రెండెడ్లను కట్టుకుని, మనం కలిసి వెళ్లాలని తెలుపుతుంది.

      ‘‘డ్యాగవాయే ల్యాగపాయే తుమ్మెదో

      డ్యాగ ఎంద్కువాయే రాజా తుమ్మెదో

      డ్యాగ వోయి అలావాల తుమ్మెదో

      మాలుమీద వాలినాది తుమ్మెదో’’ (వొయినం, పుట :76)

వంటి పాటలతో ఈ నవలను కొనసాగించింది. రచయిత్రి ఈ నవలలో శిల్ప చాతుర్యంతో పాటు చక్కని పాత్ర చిత్రణ ప్రవేశపెట్టి ఆ పాత్రల ద్వారా సందర్భాను సారంగా పాటలను పాడిస్తూ పాఠకుల మన్ననలను పొందింది. ముఖ్యంగా జానపదుల పాటలు వారి శ్రమను, అలసటను పోగొట్టడానికి ఏర్పాటు చేసుకున్న ఒక ప్రక్రియ. పాటలు పాడడం వల్ల వారి సంస్కృతి, సంప్రదాయాలు, పద్దతులు, కట్టుబాట్లు మొదలైన అంశాలు మనకు ఇందులో కనబడుతుంటాయి.

ఇలా ఈ నవలలో మనకు తెలంగాణ భాష, యాస, మనుష్యుల మధ్య ఉన్న ఆలోచనా విధానాలు ఒక మహిళ ఏదైనా తలుచుకుంటే అనుకునేదాక దాన్ని సాధించాలనే తపన, పురుషాధిపత్యం ఈ సమాజంలో

ఉంటుందో తెలుపుతూ నీలమ్మ పాత్ర ద్వారా మనకు కనబడు తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని చేదించుకునే సత్తా మాకు ఉంది అని నిరూపించింది నీలమ్మ. ముఖ్యంగా సమాజంలో మనుష్యులు ఎలాంటి ఆలోచనతో ఉంటారో ఈ నవల ద్వారా జాజుల గౌరి చక్కగా వివరించారు.

3. ముగింపు:

ఇలా వొయినం నవల చాల చక్కని గేయాలతో  కొనసాగింది. ఇందులోని గేయాలు సందర్భానుసారంగా నవలకు ఎంతో సౌందర్యాన్ని చేకూర్చాయి. వాస్తవానికి  రచయితలకు గాని రచయిత్రులకు గేయాలను గురించి పరిచయం ఉంటేకాని గేయాలను వివిధ సందర్భాలలో ఉపయోగించలేరు. కాబట్టి దీన్నిబట్టి రచయిత్రికి గేయాలపై కొంత పట్టు ఉందనే చెప్పవచ్చును. సందర్భానుసారంగా గేయాలు మాత్రమే కాకుండా సామెతలు, జాతీయాలు ప్రయోగిస్తు చక్కని మాండలిక పదాలతో నవలను ముందుకు నడిపించారు.

4. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గౌరి, జాజుల. వొయినం నవల, విశాల సాహితి పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌. 2012
  2. రామరాజు, బిరుదురాజు. తెలుగులో జానపద గేయ సాహిత్యం, జానపదవిజ్ఞాన ప్రచురణలు, హైదరాబాద్‌. 1990
  3. తిరుమలరావు, జయధీర్‌ దళిత గేయాలు, హైదరాబాద్‌, 1997

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]