'ఔచిత్యమ్' యుజిసి కేర్ జర్నల్ సంపాదకులకు నమస్సులు. ఉత్తమసాహిత్యవ్యాసాలను ప్రచురిస్తూ, రచయితలకు తగిన సూచనలిస్తూ, పరిశోధకులను ప్రోత్సహిస్తూ, పరిశోధనా విలువలను పాటించటంలో, ఉత్తరప్రత్యుత్తరాలలో మర్యాదపూర్వకమైన, సత్వరమైన స్పందనతో ఎంతో గౌరవంగా, హుందాగా పత్రికను నిర్వహించే తీరు అనితరసాధ్యం. ఔచిత్యంలో పరిశోధనా వ్యాసం ప్రచురింపబడటం గొప్ప అదృష్టం. పాత సంచికలు చదువుతూ ఉంటే, ఎంతోమంది గొప్ప రచయితలు పరిచయమవుతున్నారు. వారు వ్రాసిన వ్యాసాల ద్వారా కొత్త సాహిత్యాంశాలు తెలుస్తున్నాయి. పరిశోధక మిత్రతో పాటు, కొత్తగా చేర్చిన సూచికాలేఖిని రచయితలకు ఎంతో ఉపయోగంగా ఉంది. మూడు వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలను తెలియజేస్తూ, భవిష్యత్తులో పత్రిక మరింత ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నాను.
- కె. మాధవి
తెలుగు అధ్యాపకురాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిఠాపురం.
నమస్కారం.... తెలుగు పరిశోధనా రంగంలో మీరు చేస్తున్న
సరికొత్త ప్రయత్నాలు
"ఔచిత్యం" పత్రిక స్థాయిని
మరింత పెంచుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందిస్తూ.... ఇలాంటి ప్రయత్నాలు
మరిన్ని చేయాలని ఆహ్వానిస్తున్నాను ...మీ ప్రయత్నాలు పరిశోధకునికి సరికొత్త ఆకరాన్ని అందిస్తూ, తమ
పరిశోధన పత్రాలను మరింత సులువుగా రాసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయని నిస్సందేహంగా చెప్పగలను.
ఈ విధమైన సరికొత్త ప్రయత్నాలతో తెలుగు పరిశోధనా రంగానికి కొత్తదనాన్ని పరిచయం చేస్తున్న మీ సంపాదక
బృందానికి, ప్రత్యేకంగా మీకు నా అభినందన పూర్వక కృతజ్ఞతలు...🙏🙏🙏👌👌👌💐💐💐
- డా. కె.వి.ఎన్.డి. వరప్రసాద్
తెలుగు శాఖాధ్యక్షులు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం.
I am happy to note the new feature "Bibliography/references generator" added to the online journal.
Certainly, it's a value addition and a ready reckoner to the new researchers. Keep going, and do add
the best tools to the journal in the future. Best wishes to you and to your team members!
- Prof. Dr. Pammi Pavan Kumar
Professor of Telugu, School of Humanities, University of
Hyderabad.,
Head, Centre for Endangered Languages, and Mother Tongue
Studies (CEL&MTS).,
Member, Planning-cum-Monitoring Board of the Centre of Excellence in
Studies for
Classical Telugu, Dept. of Higher Education, CIIL, Mysuru.