headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

12. సూక్తి, రసజ్ఞత, లోనారసి , జాడ వేరు: అనుశీలన

డా. జాడ సీతాపతిరావు

అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజివీడు ప్రాంగణం,
ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9951171299, Email: seethuphd@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ప్రాచీనకావ్యాల్లో కవులు వాడిన పదాలలో కొందరు కవులు స్వీయ కవిత్వ లక్షణాల్ని చెప్పుకున్నారు. విమర్శకులు కూడా తెలిపారు. అయితే వారి దృష్టికోణాలను వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్వయించుకోవాల్సి ఉంటుంది. పాఠకుడు కావ్యాన్ని, కవితను అర్థం చేసుకోవడంలో విమర్శకుడి పాత్ర ప్రత్యేకమైంది. కవితా హృదయాన్ని ఒక్కొచోట పాఠకుడు పట్టుకోలేని స్థితి అనిపిస్తే విమర్శకుడు దాన్ని వివేచనతో సాధికారికంగా పాఠకుడికి అందించే ప్రయత్నం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో సూక్తి, రసజ్ఞత, జాడవేరు పదాలను వాటి ప్రయోగాల వైవిధ్యాలను అందించడం ఈ వ్యాస ఉద్దేశం. పూర్వ పరిశోధనలో “సూక్తినిధి నన్నయ” పేరుతో రామబ్రహ్మం, బేతవోలు చాలా వరకు వివరించారు. లోనారసి పదాన్ని అనుసరించి కొన్ని పద్యాల్ని విమర్శనాపరంగా నన్నయ వాడారు. రసానికి సంబంధించిన పరిశోధనలు వామనుడి నుంచి విమర్శకులు సూచించారు.

Keywords: ప్రాచీనకావ్య కవులదృష్టి, ఆధునికకావ్యఅవసరాలు, సూక్తి, రసజ్ఞత, జాడవేరు, విమర్శ పదాల వివేచన.

1. ఉపోద్ఘాతం:

కవి కావ్యాన్ని రాసినా, కవిత్వాన్ని చెప్పినా; అందులో అతడి లక్ష్యం, ప్రయోజనం, గమనం సాధారణంగా ఉంటాయి. ఒక్కో కవి, రచయితది ఒక్కో అభినివేశం. ప్రతీ వ్యక్తి స్వార్థం కలిగి ఉండడం సహజం. కవిత్వంలో విశేషణ గుణాలను అన్వయం చేసుకునేలా చెప్పడంలో కవి ఓర్పు, నేర్పు, నైపుణ్యాలను ఒడిసి పట్టుకున్నవారికి పట్టుకున్నంత. ఇందులో సూక్తి, రసజ్ఞత, లోనారసి, జాడవేరు ఇలాంటి పదాలు కవికున్న వైదుష్యాన్ని అనుసరించి పద ప్రయోగాలు చేస్తుంటారు.
భారతీయకావ్యసిద్ధాంతాలలో ప్రప్రథమమై౦ది.  రససిద్ధాంతం రసం అనే పదం ఋగ్వేదంలో సోమరసం, పాలు.  అధర్వణవేదంలో నది, రుచి. ఉపనిషత్తుల్లో సారం. ఔషధశాస్త్రంలో పాదరసం. వేదాంతశాస్త్రంలో ఆత్మ, పదార్థం. లోకంలో పానకం లాంటివి ద్రవ విశేషాలు. అలంకారికులు చెప్పిన రసం నాటక, కావ్య-కళా రసం. ఈ రసాన్ని సహృదయుడు అనుభవిస్తాడు. దీనికే కవులు విభిన్న పదాలతో వారి పాండిత్య ప్రకర్షను తెలిపారు. వెరసి పాఠకుడికి సాహిత్య ప్రయోజనాలు కేవలం ఆనందం మాత్రమే కాదు. జీవితంలో అన్వయించుకోవడం అంతర్గత అంశం. దీనిలో భాగంగా  సూక్తి, రసజ్ఞత, జాడవేరు పదాలను వాటి ప్రయోగాల వైవిధ్యాలు ఈ వ్యాస పరిధి. 

2. సూక్తి పద వివేచన:

సూక్తి అనే కావ్యంలో వాడే మాటను పరిశీలిద్దాం. సు+ఉక్తి మంచి మాట అని సామాన్యార్థం. సూక్తి అంటే చక్కగా చెప్పిన మాట. నన్నయ తన స్వీయ కవితా లక్షణాల్లో ఒకటి నానారుచిరార్థ సూక్తి నిధి. ఇది అతడి వ్యక్తిత్వ వికాసంగా అనిపిస్తుంది. రుచిరమైన చమత్కార యుక్తమైన మార్పును సూక్తి అని ఖండవల్లి లక్ష్మీరంజనం (ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహం)చెప్పారు. అలంకారిక రచన, లోకోక్తులు, నీతులు, సామెతలు, పదబంధాలు, అన్నీ సూక్తి నిధి లోని భాగాలే.

2.1 వ్యుత్పత్తి, వివరణ: 

“శోభనా చ సా ఉక్తిశ్చ సూక్తిః” అనేది వ్యుత్పత్త్యర్థం. శోభనత్వం అంటే సౌందర్యం. ఇది అంతర, బహిః సౌందర్యాలు. అర్థ సౌందర్యం లోపలది. వర్ణ సౌందర్యం బయటకు కనిపించేది. శబ్దగతమైనది శబ్దాలంకార శోభితం. అర్థగతమై విరాజిల్లేది అర్థాలంకార భరితం. ఇక్కడ ఉక్తుల సౌందర్యం కంటే సూక్తుల సౌందర్యం అనాలి. అందుకే   వామనుడు "సౌందర్యమలంకారః" (కవికోకిల గ్రంథావళి, పుట 146, వ్యాసాలు) అని తేల్చాడు. కావ్యశోభను కలిగించేవి గుణాలు అని, దాన్ని అతిశయించే హేతువులు అలంకారాలని వివరించాడు.

 "శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదవెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులయు గరికర శీతల చ్ఛాయ దచ్ఛీకరాంబు
కణముల చల్లని గాడ్పాసపడి వాని జెంది సుఖం బున్న సింహములయు,
భూసుర ప్రవరులు భూతబలుల్ దెచ్చి పెట్టు నీవారాలన్న పిండతతులు
గడంగి భక్షింప నొక్కట గలసియాడు
చున్న యెలకులు బిల్లుల యొండులయు
సహజ వైరివర్గంబులయు సహవాస మపుడు
సూచి ముని శక్తి కెంతయు జోద్యమంది" (ఆంధ్ర మహాభారతం, ఆది. 4-23)

ఇందులో ప్రశాంత వాతావరణం వర్ణ్యం. శతృత్వాన్ని వదిలి జీవించడం కణ్వశక్తి. ఋషులు సామగానాన్ని అనడాన్ని విని నేర్చుకున్న చిలుకలు సామవేద గానం చేయడం. ఇవన్నీ శ్రవణ సుఖాన్నిస్తున్నాయట. ఇందులో రాబోయే కావ్య కథలో ఉండే గ్రామీణ జీవనంలో ఉండే శకుంతల, నాగరిక జీవితంలో ఉండే దుష్యంతులు ఏకమై కథ సుఖాంతం కాబోతుందనే విషయం కథ పూర్తిగా చదివాక పాఠకుడికి ఈ వర్ణనలో ఉన్న రుచిరత్వం తెలుస్తుంది. 

లోనారసి పదాన్ని పరిశీలిద్దాం. నన్నయ ప్రయోగమిది. సంస్కృత కవీంద్రులు కథకలితార్థ యుక్తితో లోనారసి మేలు అంటే, తెలుగు పాఠకులు తెలుగు భారతంలోని అక్షర రమ్యతను ఆదరిస్తారు.

3. రసజ్ఞత సాలోచన:

రసజ్ఞత అంటే ఒక కళని పూర్తిగా ఆస్వాదించగలగడం. రసజ్ఞత=రస + జ్ఞాత (రసాన్ని జ్ఞానాగ్నిలో దహించేవారని) అంటే నవరసాలతో కూడిన కవిత్వాన్ని రాయగలగటమో లేదా వేరేవాళ్లు రాసినదాన్ని ఆస్వాదించడమో లేదా చెప్పడమో లేదా విని ఆనందించడమో కావచ్చు. సమయ సందర్భాలు తెలుసుకొని సరసత్వంతో స్పందించే హృదయం రసజ్ఞతరసం అంటే సారం. మొత్తం విషయంలో ప్రధాన లక్ష్యం ఏమిటో చూచే మనసున్న వాడు రసికుడు. 

"ఒకరి రచనా వైదుష్యాన్నీ ప్రవచనా ప్రతిభను ఆస్వాదించగల నేర్పు కలిగి వుండడం రసజ్ఞత"- ఉమామహేశ్వర గారపాటి.

లలితా సహస్రంలో అమ్మవారికి రసజ్ఞా అనే అమ్మవారి నామాన్ని చూడొచ్చు. రసాస్వాదన ప్రతి జీవికి భగవంతుడిచ్చిన వరప్రసాదం రసాస్వాదన ఆనందాన్ని చిమ్ముతుంది. అందుకే

"యద్వా తత్ సుకృతమ్ । రసో వై సః । రసం హ్యేవాయం లబ్ధ్వాధ్యనన్ది భవతి ॥ 2 ॥

యద్వై తత్ సుకృతం | రసో వై సః | రసం హ్యేవాయం లబ్ధ్వా" నంది భవతి || 2 || అని (తైత్తిరీయ ఉపనిషత్తు అధ్యాయం-8 లో) పేర్కొన్నారు.

తనను తాను 'జీవుడు, అంతకు మించినది'గా వ్యక్తీకరించే బ్రహ్మం ఈ సృష్టిలో సర్వోత్కృష్టమైన 'రసం' లేదా రుచి అంటే సారాంశం, అమర బ్రహ్మం, ఆనందం, ఆనందం. విశ్వం, రుచిలేనిది, కానీ, రుచిగా కనిపిస్తుంది. రుచి' అనే పదం బ్రహ్మనే పరమానందాన్ని సూచిస్తుంది. రుచిని గ్రహించాక,  ఆనందంతో నిండిన,  తనను తాను ధన్యుడిగా భావించే ఋషిని మనం కనుక్కొంటా౦. ఋషికి పుష్పాలు, స్త్రీ మొదలైన ప్రాపంచిక భోగ వస్తువులు లేవు. కేవలం ఆత్మజ్ఞానిగా  ఉంటాడు. పువ్వులు లాంటి  ఇతర వస్తువులు అతని దృష్టిలో ఆస్తులు కావు. జ్ఞాని ఆనందానికి మూలమైన బ్రహ్మానందం.

రసాన్ని వేదాలలోనూ వర్ణించారు. "నిజంగా, భగవంతుడు రస" (రసో వై సః) శబ్ద వాచ్యుడిగా ఉపనిషత్తులు, వేదాలు ఘోషిస్తున్నాయ్. నరుడు నారాయణుడిగా మారడానికి, మార్చుకోడానికి ఈ దృక్పథం అవసరం. అందుకే వ్యాసుడు నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం... అంటూ ఆరంభంలోనే ప్రకటిత నమస్కారాన్ని అర్పిస్తాడు.

"చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!" (భాస్కర శతకం పుట: 40)

ఇక్కడ "రసజ్ఞత" అంటే దాన్ని ఉపయోగించుకునే విధానం. దీన్నే application అంటారు. రుచితో రసజ్ఞతను పోల్చడం గమనించవచ్చు. దీనివల్ల విషయ సౌందర్యం ఆస్వాద యోగ్యం.

కావ్యంలో లేదా కవిత్వంలో ఉండే ప్రత్యేక గుణం ఈ రసజ్ఞత. దీనివల్ల ఎన్ని రకాలైనా పాఠకుడు తన పాండిత్య, అన్వయ, ఆలోచనలతో ఊహించుకొని అన్వయించుకోవచ్చు. ఇది దీని విశిష్ట సౌందర్య తత్త్వం.

సాహిత్యం అంటే హితాన్ని కోరేదని వ్యుత్పత్త్యర్థం. సాహిత్య ప్రయోజనం ఇదే. ప్రాచీనకవులు రసజ్ఞతను వివిధ రకాలుగా వాడారు. నన్నయ లోనారసి అంటే లోపలకు వెళ్లి చూచి అనుభవించి అనుభూతిని పొంది విభూతి స్థాయిని అందుకోవడం. రసానందం కేవలం ఆనందాన్నిచ్చేది కాదు. ఆలోచనామృతం కూడా. మహాప్రస్థానంలో “వర్షుకాభ్రముల ప్రళయఘోషలు” అంటారు.

"ఎముకలు క్రుళ్ళిన/ వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,/ శక్తులు నిండే
సైనికులారా! రారండి!
“హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!” అని కదలండి!
మరో ప్రపంచం,/ మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!" (మహాప్రస్థానం కవిత, పుటసంఖ్య, 20)

“వర్షుకాభ్రములు” అంటే మహా ప్రవాహంలా హోరెత్తించే ఆ కవిత్వ వేగం సామాన్య పాఠకుణ్ణి సైతం ముందుకు ఉరికేలా  చేస్తుంది. ప్రతిజ్ఞలోని “పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ”, కవితా ఓ కవితా లోని “ఘూకం కేకా, భేకం బాకా” ఇవన్నీ ఉత్తేజితాలైన చైతన్య రూపాలే. ప్రపంచ ప్రసిద్ధుడైన రష్యన్ విప్లవకవి  మైకోవస్కీ తన ఇరవై సంవత్సరంలో రాసిన Our March లోని విప్లవ పథంలోని నడవమని పీడిత జనులను సందేశమది. అందులోని 'with mice old men I have nothing to do అనే పంక్తిలోని భావాన్ని శ్రీశ్రీ తీసుకుని 'ఎముకులు కుళ్లిన వయసు మళ్లిన.... ఇలాంటి చతురస్ర, త్రిస్ర గతిలో సాగుతుంది. రాజకీయార్థిక విధానాల్ని మార్చడానికి ప్రజల తిరుగుబాటే మార్గం అనే ఉద్వేగపూరితమైన ప్రబోధం ఆలోచనామృతం.  అడ్డంకులను అధిగమించి ప్రయాణం సాగించడం కర్తవ్య బోధ.  రష్యాలో అక్టోబర్ విప్లవంలో శ్రామిక, సైనిక, నావికులు పీడిత వర్గంతో కలిసి సంకెళ్ళను ఛేదించే స్పూర్తి ఈ ప్రబోధానికి సంఘటన. దోపిడి వ్యవస్థను నాశనం చేసి సామ్యవాద వ్యవస్థలోకి ప్రవేశించేందుకు తగిన వేగం సూచ్యం.

కదం తొక్కుతూ అనేచోట గుర్రాల్లా బరువులు మోస్తూ ఉత్సాహంతో పరుగును, పదం పాడుతూ అనేచోట ఆవేశంతో కూడిన గమనం, హృదంతరాళం గర్జిస్తూ అన్నపుడు సింహాల్లా పీడక వర్గంమీద విరుచుకు పడాలి. ఇక్కడ గుర్రాలు, ఆవేశం, సింహాలు అనే ఉపమాన పదాలు వాచ్యం చేయకపోవడం ఆలోచనామృత రసజ్ఞత.

ఉ. "భైరవయోగిరాజు పసిపాపనినంజుడుఁగూరలందు లో
      నారసి చూచి మస్తకమునందలి మాంసము లేమి గాంచి యీ
     నీరసమాంస మేటికి వణిగ్వర! పుత్రునియుత్తమాంగముం
     గూరలు సేయ వైతి వివిగో నిజపుత్ర నిసర్గమోహముల్". (హర విలాసము, 2- 127) 

ఇక్కడ కూరలందు లో నారసి చూసి ఆమ్టే పరీక్షగా చూశాడు. ఉత్తమాంగమైన తల భాగం స్వభావ సిద్ధమైన ప్రేమ వల్ల ఇందులో కూరగా చేయలేదనే విషయాన్ని గమనించడం. ఇక్కడ కవి చెప్పదలచుకున్న విషయాన్ని బాగా గమనించేలా చెప్పడం, ఆలోచింపజేసేలా వర్ణించడం చాలా ముఖ్యం.

3. లోనారసి లోతైన దృక్పథం: 

లోనారసి పదాన్ని పరిశీలిద్దాం. వ్యంగ్యార్థ సంయోజన. కావ్య సౌందర్యాన్ని పరోక్షంగా చెప్పడం దీనిలోని తత్త్వం.

"సుతుల విద్యాప్రవీణత జూచు వేడ్క
నెంతయును సంతసంబున గుంతిదేవి
రాజు సన్నిధి, గాంధార రాజపుత్రి
కెలన నుండె, నున్మీలిత నలిననేత్ర" (ఆంధ్ర మహాభారతం, ఆది. 6-6) 

"ఉత్ + మీలిత, నలిన, నేత్ర" = బాగా విచ్చిన తామరపూ రేకుల్లాంటి కళ్ళు కలది కుంతి. ఉత్సాహం, సంతోషం ఆ కళ్లు వర్ణనలో విశేషం. ఇక్కడ సందర్భాన్ని, సన్నివేశాన్ని గమనించాలి. కుమారాస్త్ర విద్యాప్రదర్శన సందర్భం. కొడుకుల విద్యానైపుణ్యాన్ని చూడాలనుకునే మాతృమూర్తి మానసిక స్థితి సన్నివేశం. గాంధారి, ధృతరాష్టుడు, కుంతి ఉన్నారు. ఇందులో గంతలు కట్టుకోవడంతో గుడ్డితనం గాంధారిది. పుట్టు అంధత్వం ధృతరాష్ట్రుడిది. ఇద్దరు చూడలేని వాళ్ళ పక్కన; కుంతిని కూర్చోబెట్టి, ఆమె బాగా విచ్చుకున్న కళ్ళతో ఆనందంగా తన పుత్రుల విద్యానైపుణ్యాన్ని కుంతి చూస్తోందనడం. పాపం ఆ చూడలేని గాంధారి, ధృతరాష్ట్రుల దుస్థితిని వెక్కిరించినట్టు వారి ఆంతరంగికం. కానీ అది ఎక్కడా తేలకుండా చూపడం లోనారసిలో వైవిధ్యం.  దిన్నె తులనాత్మక సౌందర్యాన్ని వెలార్ఛే స్థిరచిత్రంగా విమర్శకులు తెల్పారు .

4. జాడ వేరు పద వైవిధ్యం:

జాడ వేరు పదాన్ని చూద్దాం. అందరికీ సులువుగా తెలిసిన పద్యం-

"ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు/ చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా/విశ్వదాభిరామ, వినుర వేమా"

వేమన జాడ వేరు అని వాడాడు. ఇక్కడ ఉప్పు, కర్పూరం రెండూ పదార్థాలు. పురుషులు, పుణ్యపురుషులు వ్యక్తులు. 

ఇక్కడ జాడ అనే పదానికి 1. రీతి, వలె, విధం, ప్రకారం, చొప్పు; 2. దారి, మార్గం, త్రోవ; 3. గతి, ఉపాయం, 4. అడుగుల గుఱుతు, గుఱుతు; 5.వార్త, వృత్తాంతం,  6. దిక్కు, వైపు; ప్రవర్తనము, నడవడి, 8. చోటు, ప్రదేశం, 9. కష్టం, పాటు, 10 సైగ, యుక్తం, యోగ్యం, మంచిది.   వేరు= భేదం, అన్యము ఇన్ని రకాల అర్థాలను పాఠకుల అభిరుచిని అన్వయాలను దృష్టిలో ఉంచుకొని అన్వయించుకునే వాళ్ళకు కావల్సినంత.  ఈ పద్యప్రయోగాలు, పరీక్షలుచేసి ఫలితాన్ని ఇలా చూపొచ్చు.

ప్రయోగం

పదార్థం/ వస్తువు

ధర్మం/ రుచి/రంగు

పరీక్షావిధానం

వచ్చిన ఫలితస్థితి

ప్రయోగం ఫలం సమానం/ వ్యతిరేకం

1

ఉప్పు

ఉప్పగా ఉంటుంది.  

నీటిలో వేయడం

కరిగింది/ మునిగింది

వ్యతిరేకం

కర్పూరం

వగరు

నీటిలో వేయడం

తేలింది/ ఆవిరయ్యింది

2

ఉప్పు

ఉప్పగా ఉంటు౦ది

అగ్నిలో వేయడం

పేలింది

వ్యతిరేకం

కర్పూరం

వగరు

అగ్నిలో వేయడం

కాలింది

3

ఉప్పు

తెల్లగా

రంగును పరిశీలించుట

తెలుపు రంగు

అనుకూలం

కర్పూరం

తెల్లగా

రంగును పరిశీలించుట

తెలుపు రంగు

4

ఉప్పు

ఉప్పగా ఉంటుంది

నోట్లో వేయడం

ఉప్పగా ఉండును

వ్యతిరేకం

కర్పూరం

వగరు

నోట్లో వేయడం

వగరు

5

ఉప్పు

గట్టిగా ఉంటుంది

నలిపి చూడడం

కర్పూరం కంటే గట్టి

వ్యతిరేకం

కర్పూరం

ఉప్పు కంటే కొంచెం మెత్తగా ఉంటుంది

నలిపి చూడడం

ఉప్పుకంటే మెత్తని

ప్రయోగ ఫలితం

  ప్రయోగాలలో 3 తప్ప అన్నీ ఒకదాని కొకటి బిన్నమైన ఫలితాన్ని ఇచ్చాయి కాబట్టి ఉప్పు is not equal to కర్పూరం

  దీన్ని అనుసరించి  పురుషులందు పుణ్య పురుషులను పరీక్షించాలి.

పరీక్ష

పద+అర్థం

ధర్మం/ రూపం/ స్వభావం/ గుణం/ అర్థం

పరీక్షావిధానం

వచ్చిన ఫలితస్థితి

ప్రయోగం ఫలం సమానం/ వ్యతిరేకం

1

పురుషులు

మనుషులు(రూపం)

పరిశీలించాము

ఒకేలా ఉన్నారు

అనుకూలం

పుణ్య పురుషులు

మనుషులు(రూపం)

2

 

అర్థం పరంగా

పుణ్య= ధర్మ౦; పవిత్ర౦, సుకృతం, అన్న అర్థాలు. పురుష= పౌరుషం కల

స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు. పై స్త్రీ అన్న పదానికి మళ్ళీ అర్థం తెలుసుకోవాలి

వ్యతిరేకం

స్త్రీ

అర్థం పరంగా

సహనం కల, ఓర్పు కల (గుణాలు కదా)

 

 

 

ఇక్కడ ఒక నిర్ణయానికి రావాలి . గుణం పరంగా స్త్రీలు అందరూ స్త్రీలు కారు. అలాగే మగవారికీ ఇవి వర్తిస్తాయి.

పురుషులు->1వ రకం=పురుషగుణం+పురుషరూపంకల పురుషులు.                                                                    

2వ రకం= స్త్రీ గుణం + పురుష రూపం కల పురుషులు

స్త్రీ-> 1వ రకం = స్త్రీ గుణం+ స్త్రీ రూపం కలవారు.

2వ రకం = పురుష గుణం+ స్త్రీ రూపం కలవారు.

కుండలీకరణ(Matching) చేస్తే(పెళ్లి)

పు.1 vs స్త్రీ 1-> ఫార్ములా 1= భారత దేశంలో ఉత్తమ కుటుంబం (Male Domination Family)

పు.1 vs స్త్రీ 2-> ఫార్ములా 2= తగువులు ఎక్కువ(విడాకులకు దారి, లేదా Misunderstanding Family)

పు.2 vs స్త్రీ 1-> ఫార్ములా 3= Female Domination Family

పు.2 vs స్త్రీ 2-> ఫార్ములా 4= Non-decision Family

*సంకేతాలు- పు.= పురుషులు. పు1- పైన పేర్కొన్న భేదాలు. ఇలానే స్త్రీ కూడా.

3     

పురుషులు

వ్యాకరణ పరంగా

పురుషులు బహువచనం, పుణ్యపురుషులు బహువచనం. వేరు వేరుగా కనుక్కున్నప్పుడు కనిపిస్తారు. పుణ్య పురుషుడు అనకుండా పురుషులు అని బహువచనం వాడడం వల్ల పురుషత్వం కలవారు అని స్త్రీలను కూడా సూచించడం దీని సూచన. 

ఒకేలా ఉన్నారు

వ్యతిరేకం

4

 

సాహిత్య పరంగా

“చెల్లియుండియు సైరణ సేయువతఁడుఁ,

బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ

దనకుఁ గల భంగి నిచ్చు నతండుఁ, బుణ్య

పురుషు లని చెప్పి రార్యులు కురువరేణ్య!”  (శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగ – ద్వితీయాశ్వాసము. 42)

తనకు అపకారం చేసిన వానిని దండించగల శక్తి తనకున్నప్పటికీ, ఆ శత్రువును దండనకు గురిచేయక క్షమించి వదలిపెట్టేవాడు, తాను పేదరికంలో జీవితాన్ని వెళ్ళదీస్తున్నప్పటికీ, తనను యాచించిన వానికి, లేదు పొమ్మనక, తనకున్నంతలో ప్రియంగా పెట్టేవాడు, పుణ్య పురుషులని పెద్దలు చెబుతారు. క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు. లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు.

 

వ్యతిరేకం

5

 

లోకంలో ఉన్న పుణ్యస్త్రీ, పుణ్య పురుషుడు పరిశీలన

పుణ్యస్త్రీ వాడుక భాషలో పునిస్త్రీ అంటారు. అంటే భర్త బతికి ఉండగా ఆమె తనువు చాలించింది. అంటే భర్తకు సేవలు చేస్తూనే తరించి, బంధనాలనుంచి ముక్తి పొందింది. ఈ నేపథ్యంలో చూడాల్సి వస్తే పుణ్య పురుషుడు అంటే భార్య ఉంటుండగానే అతడు చనిపోవడం. కానీ లోకంలో ఇలాంటి వ్యవహారం లేదు.

 

వ్యతిరేకం

6

 

వేదాంత ధోరణి

ఒక వ్యక్తి భక్తి భావనకు తార్కిక(లాజిక్)దృష్టిని జత చేస్తే అది వేదాంత దృక్పథం అవుతుంది. ఉన్నంతలో దానం చేయటం పుణ్యప్రదం. ‘ఒరులకు పెట్టి తాననుభవించటం’ మన జీవన సూత్రం కావాలి. ఎదుటివాని ఆకలిబాధనో, మరే ఇతర కష్టాన్నో అర్థం చేసుకొని సహకరించటం మంచిమనసు కలవారికే చెల్లుతుంది. అదే సార్థకమైన జీవితం. వేమన నాస్తికుడు అనే మాటతో చాలమంది భావిస్తారు. వివేకానంద నాస్తికుడు అన్న మాటకు “తనను తాను నమ్మని వాడు” అని చెప్పాడు. ఈ అంశాన్ని స్థూలంగా ప్రతివారూ జీవితంలో అన్వయం చేసుకోవాలి. పురుషత్వం త్యాగంతోనూ, ఎదుటివారి కష్టాలను చూసి ఆర్ధ్రత కలిగినప్పుడు వారిలో ఇలాంటి స్థితి కలగవచ్చు.

 

వ్యతిరేకం

 • 1వ ప్రయోగం తప్ప మొత్తం ప్రయోగాల ఫలితం వ్యతిరేకం. ఉప్పు, కర్పూరానికి అన్వయిస్తూ పరిశీస్తే ఉప్పు సాధారణ పురుషత్వం. కర్పూరానిది తనను తాను కోల్పోయినా మంటలో వేసినప్పుడు కాసేపైనా నిప్పుకు చల్లదనాన్ని ఇచ్చానన్న అభిమతం, అలాగే పుణ్య పురుషత్వానిదీనూ. పురుషుడి వల్ల ప్రయోజనాలు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ పుణ్యపురుషుడు లోకాన్ని పది కాలలపాటు ఆనందంగా ఉంచాలని, దానికి తగిన విధంగా వారి నడవడిక ఉంటుందని దీని నిగూఢ అర్థం.

దీని ద్వారా జాడ వేరును చూపించాడు. వస్తువులు, వ్యక్తుల మధ్య పోలికను సాంకేతికంగా, శాస్త్రీయంగా నిరూపించడం జాడవేరు అనడంలో వినూత్నం. 

5. ముగింపు:

 • పై పదాలను వాడిన కవులు ప్రయోగాలు పాండిత్య వైవిధ్యాల చిహ్నాలు. సూక్తి పదానికి సూక్తి చక్కగా చెప్పిన మాట, వ్యక్తిత్వ వికాసం, చమత్కార యుక్తమైన మార్పును చెప్పేదిగా గ్రహించవచ్చు.
 • రసజ్ఞత- ప్రతిభను పాండిత్యాన్ని అర్థం చేసుకోగల శక్తి. సౌందర్యాన్నిచ్చే స్థిర చిత్రం లోనారసి. ఇది పాఠకుణ్ణి ఊహించి గమనింపజేసి కనిపించేలా దర్శింపజేయడం ఇందులో భాగం.
 • జాడ వేరు- వస్తువులు, వ్యక్తులు, వ్యవస్థలు మధ్య ఉన్న సున్నితమైన తేడాను కాస్త సాధన చేసైనా గ్రహించడం.
 • ఒకరు రసదృష్టి, పరిశీలనాదృష్టి, తులనాత్మక దృష్టి ఇలా పదాలను ఆయా కవుల సన్నివేశ, సందర్భాలను, వివిధ అంశాలను నిశితంగా పరిశీలించి, పరిశోధించి శోధిస్తే పాఠకుడికి అందని అంశాలను కూడా విమర్శకులు ఆయా మార్గాల ద్వారా సాధికారికంగా అందించవచ్చు.
 • పాఠకుడికి వాహ్వ్ అనిపించేలా చేయడం ఆలోచింపజేయడం, ఆనందింప జేయడం, అన్వయించుకునేలా చేయడం సాహిత్య ఆధునిక అన్వయ వివేచన రూపాలు.

6. ఉపయుక్తగ్రంథసూచి:

 1. రామకృష్ణ, మిరియాల: శ్రీశ్రీ కవితా వైభవం: డా. మిరియాల రామకృష్ణ ప్రచురణ, యువభారతి సాహితీ సంస్కృతిక సంస్థ, 5 కింగ్స్ వే, సికింద్రాబాద్-3
 2. రామకృష్ణ, మిరియాల:  శ్రీశ్రీ కవిత్వం: వస్తువు, సంవిధానం.  
 3. రామబ్రహ్మం, బేతవోలు: "సూక్తి నిధి నన్నయ" (వ్యాసం)
 4. వెంకయ్య, మారద:  1938: భాస్కర శతకం: సత్యనారాయణ బుక్ డిపో, రాజమండ్రి 
 5. వేంకటావధాని, దివాకర్ల: 1976: నన్నయ కవితా వైభవం, యువభారతి ప్రచురణ, హైదరాబాదు.
 6. వేమన: 1949: వేమన రత్నములు: వెంకట్రామ&కో, విజయవాడ- మద్రాసు,
 7. శ్రీనాథుడు: 1966: హర విలాసము  ముద్రణ: వి. వెంకటేశ్వర శాస్త్రులు ట్రస్ట్, మద్రాస్.
 8. శ్రీశ్రీ: మహాప్రస్థానం: 1950: తొలి ముద్రణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హస్, హైదరాబాదు.  
 9. శ్రీ సూర్యా౦ధ్ర నిఘంటువు (మూడవ సంపుటం) జ-ధ, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, తృతీయ ముద్రణ, 1988
 10. సుబ్రహ్మణ్యం, జీవి: 2000: శ్రీమదాంధ్ర మహాభారతము: ప్రధాన సంపాదకులు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ, తిరుపతి.
 11. సైదులు, బి: జూన్ 2, 2024; ఎవరు నాస్తికులు ఆదివారం ఈనాడు, మకరందం,  (వ్యాసం)

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]