headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. అల్లం శేషగిరిరావు ‘అరణ్య ఘోష’ కథలు: సామాన్యుని జీవనం

డా. పురుషోత్తం గుంట

పరిశోధకులు,
తమ్మినాయుడుపేట,
శ్రీకాకుళంజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8019215609, Email: purushottamgunta@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

అల్లం శేషగిరిరావు అరణ్యఘోష కథానిక సంపుటిలో రిక్షా కార్మికుల కుటుంబ పరిస్థితులు, టాక్సీ నడిపేవాళ్ళ జీవనస్థితిగతులు, కావలి వాళ్లు, రైల్వేకార్మికులు, సంచారజీవులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, అనాథలు అదేవిధంగా సన్నకారు రైతులు, వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు వేటగాళ్లు గురించి ప్రస్తావనలున్నాయి. అరణ్య ఘోష కథల్లో సామాన్యుని జీవనం తెలియజేయడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. అరణ్యఘోష, మంచి ముత్యాలు అనే కథాసంపుటాలు, వివిధ వ్యాసాలు ఈ పరిశోధనకు ఆధారం. వీరి కథల్లో సంచారజీవులు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు, కష్టజీవుల బాధలను, భూస్వాముల ఆగడాలను పేర్కొంటూ విశ్లేషణాత్మక పద్ధతిలో ఈ పరిశోధన వ్యాసం రూపుదిద్దుకుంది.

Keywords: ది లాంగెస్ట్ డే, ఆపరేషన్ ఫాల్కన్, రుద్రనేత్రం, చీకటి, అభిశప్తులు, మృగతృష్ణ, సింహాచలం, కొండడు, పైడయ్య, డిబిరిగాడు.

1.ఉపోద్ఘాతం:

ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో కథానిక ఒక విశిష్ట ప్రక్రియ. సమాజంలో జరిగే వివిధ సంఘటనలను కథానిక ప్రక్రియ తెలియజేస్తుంది. నేటి కాలంలో చదివే పాఠకులు కొరవడుతున్న తరుణంలో కథానిక ప్రక్రియ పాఠకులను రంజింప చేస్తుంది. అటువంటి విశిష్టతగల కథానిక ప్రక్రియను ఎంచుకొని మంచి కథలను కొన్నింటిని తెలుగువారికి అల్లం శేషగిరిరావు గారు అందించారు.

2. రచయిత పరిచయం:

అల్లం శేషగిరిరావు గారు తేదీ. 9-12- 1934.  ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఛత్రపురం గ్రామంనందు జన్మించారు. వీరు ఎమ్.ఎ పోలిటిక్స్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేశారు .వీరు రాసిన మంచి ముత్యాలు కదా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1980-81 లో లభించింది. దానిని డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి గారి చేతుల మీదుగా రచయిత అల్లం శేషగిరి రావు గారు అందుకున్నారు.శేషగిరిరావు గారి కథలు రాశిలో తక్కువ అయినా వాసిలో మిన్న అని చెప్పటానికి సందేహించనవసరము లేదు. వీరి 'మంచి ముత్యాలు', 'అరణ్య ఘోష' కథా సంపుటాల్లో సామాన్యుడు తన జీవితం కోసం పడుతున్న కష్టాలను ఆరాటాలు వెతలు బాధలు పోరాటాలు కనిపిస్తాయి.

ఎన్నో కథలు వచ్చాయి కానీ తెలుగులో వేట గురించి కథలు శ్రీ అల్లం శేషగిరి రావు గారు రాసే వరకు రానే లేదని చెప్పవచ్చు నేమోనని నేను అనుకుంటున్నాను.1 (మంచి ముత్యాలు కథా సంపుటి, ముందు మాట.)

ఈ వేట కథలన్నీ చాలా నిజాయితీతో రాసిన కథలు. అంతే కాదు వేట జీవితాల్ని శ్రీ శేషగిరి రావు గారికి బాగా తెలిసే ఈ కథలు రాసేరు.  ఈ వేట కథలు తెలుగు కవిత తా సుందరికి కొత్త అలంకారాలని చెప్పడం కంటే ఇవి తెలుగు సాహిత్య లోకంలో కొత్త వెలుగులని చెప్పడం సమంజసంగా ఉంటుందని నేను తలుస్తున్నాను. ఈ వేట కథలకి పరిచయ వాక్యాలు రాయమని శ్రీ శేషగిరిరావు గారు నన్ను కోరడం అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను2. (మంచి ముత్యాలు కథా సంపుటి, ముందు మాట.)

3. అరణ్యఘోష కథల్లో సామాన్యుని జీవనం:

3.1 రిక్షా కార్మికులు. 

ది లాంగెస్ట్ డే కథానికలో సింహాచలం అనే రిక్షా కార్మికుడు అద్దెకు రిక్షా తీసుకుని నడుపుతుంటాడు. రిక్షాకు సరిగా బేరాలు ఉండవు. టాక్సీలు వచ్చిన తర్వాత రిక్షాలకి బేరాలు పడిపోతాయి. రిక్షా యజమానికి అద్దె కట్టలేక తన కుటుంబాన్ని పోషించలేక సింహాచలం నానా అవస్థలు పడతాడు. 

"ఏయ్ రిక్షా కారు హారన్ బాబయ్యా, పక్కకి తీసేస్తున్నాను. ఒక్కచిటం

ఇదిగో, ఓయ్ రిక్షా.. గాడీ పక్కకి తప్పించి కాస్త చోటేట్టయ్యా, ముసలోడ్ని. 

ఎక్కడికి లాగే మంటావ్.. ముసిలోడివి రిక్షా తొక్కకపోతే మానే రాదా .

మానేస్తే నువ్వు పెడతావేటి కూడు.."3

 ఈ క్రమంలోనే తన భార్య లచ్చమ్మ జబ్బు పడుతుంది. సింహాచలముకు నూకలు కొనుక్కోవడానికి అయినా డబ్బులు లేక భార్య, భర్తలు పస్తుంటారు. రిక్షాల బంధు సమయములో రిక్షాను పొట్టకూటి కోసమై తీసిన ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో ఈ కథానిక ద్వారా తెలుస్తుంది. ఆకలితో జబ్బు పడిన తన భార్యను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైన రిక్షా కార్మికుడు సింహాచలం విషాద ఘోష ఈ కథానికలో కనిపిస్తుంది.

3.2 కావలి వాళ్లు.

ఆపరేషన్ ఫాల్కన్ కథానిక లో పెద్ద కాపు యొక్క దురహంకారం వలన, కొండడు తల్లి జీవితం నాశనం అయిపోతుంది. కొండడు పెద్ద కాపు యొక్క సరస్సును సరుగుడు తోటను కాపలా కాస్తాడు.

ఆ నిర్జన ప్రదేశంలో సరస్సు ఒడ్డున చిన్న గుడిసె . అందులో ఒంటరిగా ఉంటున్నాడు కొండడు. కొన్ని నెలల క్రితమే తనని పెంచి పెద్ద చేసిన ముసిల్ది చచ్చిపోయింది.ఆ సరస్సుకి కాపలాదారు కొండడు. దొంగతనంగా సరస్సులో చేపలు పట్టకుండాను, సరుగు తోటల్లో రాత్రిళ్ళు కర్రలు నరుక్కుపోకుండాను కొండడిని కాపలా పెట్టాడు ఆ ఊరు పెద్దకాపు.4

కొండడు, చిలక , ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడతారు. అటువంటి చిలక జీవితాన్ని పెదకాపు చెరచడం వలన చిలక సరస్సులో దూకి బలవన్మరణం చెందుతుంది. పెద్ద కాపు యొక్క నీచ ప్రవర్తన వలన కొండడు చిలక జీవితాలు ఎలా బలి అయిపోయాయో రెండు తరాలుగా కొండడి తల్లిని, కొండడి ప్రేయసిని వావి వరుసలు తేడా లేకుండా పాడుచేస్తూ వచ్చిన దుర్మార్గుడు పెద్దకాపు, అతని ఆగడాలకు నలిగి పోయిన కొండడు జీవన ఘోష ఈ కథానికలో మనకు కనిపిస్తుంది.

3.3 రైల్వే కార్మికులు. రుద్రనేత్రం కథానికలో పైడయ్య రైల్వే కార్మికుడు పెట్రోల్ మెన్ గా పని చేస్తాడు.

"మెయిన్ లైన్లో బండొస్తున్నట్టుంది. అనుకుంటూ గేంగ్ మ్యాన్ క్వార్టర్సులో  నుంచి చీకట్లో లైన్లు దాటుకుంటూ ఫ్లాట్ ఫారం గట్టు ఎక్కాడు పెట్రోల్ మెన్ పైడయ్య…"5 

ఇతను రాత్రి సమయంలో రైలు పట్టాలు చెకింగ్ చేస్తూ చాలా దూరం నడుస్తున్నప్పుడు రైలు పట్టాలు మీద పడి ఉన్న పెద్ద బండరాయిని చూసి దీనిని రైలు ఢీ కొంటె చాలా ప్రమాదం అని తలచి, వెంటనే పరుగు పరుగున వెళ్లి, డేంజర్ లైట్ రైలుకి ఎదురుగా చూపిస్తూ, పెద్ద కేకలు వేస్తూ, పరుగెడుతున్నప్పుడు కాలికి రాయి తగిలి రైలు కిందపడి చనిపోతాడు. తనకంటూ ఎవరూ లేకపోయినా రైల్వేలో పెట్రోల్ మ్యాన్ వృత్తిని నమ్ముకుని తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎందరో ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదం నుంచి కాపాడటానికి అతడు చేసిన ఆర్తనాధపు ఘోష ఈ కథానిక లో కనిపిస్తుంది.

3.4 సంచార జీవులు:

చీకటి కథానికలో కెప్టెన్ వర్మ హంటింగ్ డాగ్ (సీజరు) ను తీసుకుని రాత్రి పూట వేట కోసం తంపరకు బయలుదేరుతాడు. కెప్టెన్ వర్మ తంపరలో బాతులను షూట్ చేస్తుంటాడు కొన్ని బాతులు తంపర లో పడిపోతాయి, అలా పడిపోయిన బాతులను వర్మ యొక్క కుక్క (సీజర్) నీటిలోకి దిగి వాటిని పట్టుకుని ఒడ్డుకు తెస్తుంది. అలా వర్మ ఎదురుగా చూస్తూ ఉంటాడు, అటువైపుగా చిన్న మంట కనిపిస్తుంది. వర్మ ఆ మంట దగ్గరకు సీజర్ తో వస్తాడు. అక్కడ డిబిరి గాడు మంటల దగ్గర చలికాచుకుంటూ ప్రక్కనే తంపరలో వేట కోసం కొంగను కడతాడు, వర్మ పేల్చిన ధాటికి అక్కడ చేరిన చారపిట్టలు ఎగిరిపోతాయి. మాటల మధ్య డిబిరిగాడు తన గాధను వర్మకు చెప్తాడు. 

"అన్నీ ఊళ్ళూ తిరుగుతుంటాం. ఎక్కడుంటే అదే మా ఊరు.. ఈ భూమంతా మాదే" 

దీపం వెలుతురులో వేటదొర, లాంతరు లైట్ కి పిట్టలు ఎగురొచ్చి వాలుతాయి. మచ్చల పిట్టలు రెక్కల మీద, వీపు మీద చుక్కలు ఉంటాయి. ఆ జాతి పిట్టలు ఇక్కడివి కావు. చలికి ఎక్కడి నుంచో ఎగురుకొస్తాయట ఈ యేడు ఇక్కడ దిగుతున్నాయి. నిన్ననే చూశాను. ఈరోజు లాంతరు తెచ్చాను, చీకట్లో నేను కనిపించను నీటిలోనే ఉంటాను. నా బుర్ర మీద లాంతరు మాత్రం కనిపిస్తుంది. లాంతరు దగ్గర వాలగానే కింది నుంచి నీటిలో నుంచి గబుక్కున లాగేయాలి, పక్క పిట్ట కూడా పోల్చకోకూడదు. ఈ యాటకు మంచి చేతివాటం కావాలి. ఈ యాట ను చిన్నప్పుడు మా బాబు దగ్గర నేర్చుకున్నాను. కాళ్ళని, రెక్కల్ని, పీకని ఒకేసారి చప్పుడు కాకుండా పట్టుకొని నీళ్ల కిందకి లాగేసి బుట్ట లో దూర్చేయాలి. ఈ విధంగా డిబిరి గాడు తన వేట నైపుణ్యాన్ని వర్మ కు వివరిస్తాడు. డిబిరిగాడు వేటాడుతున్న సమయములో వర్మ పేల్చిన తుపాకీ శబ్దానికి వచ్చిన పిట్టలు వెళ్లి పోవటంతో డిబిరిగాడు తన నవ్వుతో, తన నిస్పృహను వర్మకు కనిపించినట్లు చేస్తాడు.డిబిరిగాడు వేటాడిన చెవుల పిల్లుల్ని, నక్కల్ని, వలలో పడిన పావురాల్ని, కొంగల్ని, కౌజు పిట్టల్ని ఉదయాన్నే ఊర్లో అమ్ముకుంటాడు. 

ఊర్లో ఎక్కడ దొంగతనం జరిగినా వాళ్లను అనుమానంతో పోలీస్ స్టేషన్ కి లాక్ కెళ్తుంటారు. నక్క మాంసాన్ని పిల్లుల్ని కాల్చుకు తింటూ వాటిచర్మాన్ని అమ్ముకుంటారు. అందుకే వాళ్లను నక్కలోళ్ళని పిలుస్తారు. నత్త గొట్టోళ్ళు అని, పూసలోళ్ళని కూడా పిలుస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరున పిలుస్తారు. ఏ ఊర్లో దొంగతనం జరిగినా తమనే దొంగలని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించేవారు. మా జాతుల్లో కొందరు దొంగ వాళ్ళు ఉన్నారు కాని మేము అలా దొంగతనం చేయము ఉంటే తింటాము, లేకపోతే పస్తులుంటాం. పోలీస్ స్టేషన్లో తన తండ్రి తాను పడిన బాధలను వర్మకు డిబిరిగాడు చెప్తాడు. తంపర లో వచ్చే గాలులను పసిగడుతూ అవి బాతులవి అని లేక వర్షం వచ్చే గాలి అని డిబిరిగాడు ఖచ్చితముగా చెప్పడం వలన అతనికి ఉన్న వేట నైపుణ్యం మనకు తెలుస్తుంది. డిబిరిగాడి ప్రేయసి పెట్ట మందు అమ్మి తనతో పాటు ఉండేది. అలా కొద్ది కాలం తర్వాత ఆమెకి ఎర్రి నక్క కరిచేస్తుంది. కొంత కాలము తర్వాత ఆమె నక్కలాగే అరచి తనుండే చెట్టుకిందే చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె జాతోళ్ళు గాని, మా జాతోల్లు గాని రాలేదు దొర, నేనే ఆమె శవాన్ని ఊరవతల చెరువుగట్టు క్రింద పూడ్చేయడం జరిగింది. ఇది గో దొర మీరు విలాసం కోసం వేటాడితే మేము పొట్టకూటి కోసం వేటాడుతాం ఎవరు చేసినవేటలో మరి పాపం ఉంటుంది అని డిబిరిగాడు వర్మను ప్రశ్నిస్తాడు. ఈ విధంగా చీకటికదానికలో సంచార జీవుల్లోని వెతల, ఆవేదనల ఘోషలు మనకు డిబిరిగాడి ద్వారా కవి మనకు తెలియజేశాడు.

3.5 క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు:

అభిశప్తులు  కథానికలో రామారావు తండ్రి ఒక కుక్కను పెంచుతాడు. ఆ కుక్కకు వ్యాధి వస్తుంది. దానిని చాలా హాస్పిటల్స్ కి తిప్పుతాడు, చాలా డబ్బు ఖర్చు చేస్తాడు కాని చివరికి జబ్బు నయం కాదని డాక్టర్లు చెప్తారు. చివరికి రామారావు తండ్రి ఆ కుక్కను షూట్ చేసి చంపేస్తాడు. రామారావు భార్య శాంతకు క్యాన్సర్ వస్తుంది. ఆమె ఎక్కువకాలం బ్రతకదని వైద్యులు చెప్పడంతో చాలా దుఖిస్తాడు. ఆమె తన బాధను తట్టుకోలేక కేకలు వేస్తుంది. 

"….గొంతులోబాధ… భరించలేను… చంపేయ్యండి… మీకు పుణ్యముంటుంది. లేని సత్తువ తెచ్చుకొని దూరంగా నిల్చున్న రామారావుకి వినపడేటట్టు బాధతో పూడ్చుకు పోతున్న గొంతులోంచి పీండ్రించుకొని అరచింది."7

ఆమెను రామారావు ఓదార్చుతాడు. ఆమెకు చాలా సేవలు చేస్తాడు. ఆమె తన బాధను మర్చిపోవడం కోసం మరియు నిద్ర కోసం మత్తు ఇంజక్షన్ ఇస్తాడు. చివరికి తప్పని పరిస్థితులలో ఆమెకు అతను ఇంట్రా వీనస్ ఇంజక్షన్ ఇస్తాడు. దానితో ఆమె మరణిస్తుంది. ఈ విధంగా నయం కాని వ్యాధులు ప్రబలినప్పుడు ఆ కుటుంబంలోని సభ్యులు పడే బాధ వర్ణనాతీతం. 

ఎంతో ప్రేమగా చూసుకునే భార్య తన కళ్ళముందే మరణించడంతో రామారావు జీవితాంతం శోకిస్తాడు. తన భార్య అస్థికలను సంప్రదాయం ప్రకారం గంగా నదిలో పిండ ప్రధానం చేసి, గంగలో అస్థినిమజ్జనం చేసి తర్పణం విడుస్తాడు. ఈ విధంగా ఆప్తులు కోల్పోయేటప్పుడు కుటుంబ సభ్యులు ఏ విధంగా ఘోషిస్తారో ఈ కథ ద్వారా తెలుస్తుంది.

3.6 సన్నకారురైతు:

మృగతృష్ణకథానికలో బైరిగాడు అనే సన్న కారు రైతు గత మూడు సంవత్సరాలు వర్షాలు పడకపోవడంతో కోమటి సూరయ్య దగ్గర తీసుకున్న అప్పు, అసలు వడ్డీ కలిపి మూడువందలు దాటుతుంది. ఎలాగైనా తన అప్పు తీర్చి తన చెక్క(పొలం) ను విడిపించుకోవాలనే తపనతో ఇంటిలో ఉన్న నాటు తుపాకీ తీసుకొని అడవికి వెళ్లి ఏదో అడవి పందిని గాని, కణుసు గాని, దుప్పి గాని వేటాడి తెచ్చి అమ్మితే కోమటి సూరయ్య అప్పు తీరుతుందని ఆశతో అడవికి వెళ్లి-

"బైరిగాడు మెరుపులా తుపాకీ తీసి గురి పెట్టాడు. చీకట్లో కదులుతున్న మంద తప్పించి సరిగ్గా గురి చూడడానికి స్పష్టంగా జంతువులు ఆనటంలేదు.ఆలస్యం చేస్తే మంద పారిపోతుంది. దుప్పుల మంద మధ్యలో గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు .

ధూమ్ నాటు తుపాకీ మోత చుట్టు ప్రక్కల కొండల్లో ప్రతిధ్వనించింది.

దుప్పులుచెల్లాచెదురుగాపారిపోతున్నాయి.

తుపాకీ పొగ…. మందు గుండు క్రూర వాసన."8

 నానాయాతన పడి దుప్పిని కొట్టి తెస్తాడు. దుప్పిని ఇంటికి తెచ్చిన వెంటనే ఇంటికి ఫారెస్ట్ గార్డ్ వస్తాడు. తుపాకికి లైసెన్స్ లేనందున ఆరు నెలల జైలు శిక్ష, అదే విధంగా అడవి జంతువులను వేటాడినందుకు ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాడు. బైరిగాడు ఎంత ప్రాధేయపడిన ఫారెస్ట్ గార్డ్ కనికరించడు. చివరికి కోమటి సురయ్య మధ్య వర్తిత్వంతో, కోమటిసూరయ్య ఇంట్లోనే ఫారెస్ట్ గార్డ్ ను ఒప్పించి 100 రూపాయలు జరీమానాతో బైరిగాడిని విడిపిస్తాడు. కోమటిసూరయ్య వంద రూపాయలకు బైరిగాడిచే ఒక నోటు రాయించుకుంటాడు. తరువాత బైరిగాడు తనకున్న చిన్న చెక్క మీద వ్యామోహం పూర్తిగా వదులుకొని తలొంచుకు వెళ్ళిపోతాడు. ఈ విధంగా సన్న కారు రైతు కరువు వలన పంటలు పండక పోవడం చే ఏదో విధంగా బ్రతుకుదామనుకుంటే చివరికి కనికరం లేని వడ్డీ వ్యాపారస్తుల వలన ఏ విధంగా తన జీవితం నాశనం అయిందో ఈ కథానిక ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విధంగా అల్లం శేషగిరిరావు కథల్లో రిక్షా కార్మికులు, కర్షకులు, సంచార జీవులు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల వెతలను, కావలి వాళ్ళ జీవితాల్లోని మనోవేదనను మనకు కళ్ళకు కట్టినట్లు ఈ అరణ్య ఘోష కథా సంపుటి ద్వారా రచయిత తెలియజేశారు.

4. ముగింపు:

 • టాక్సీలు రావడం వలన రిక్షా కార్మికులు జీవితాలు ఏ విధంగా చితికిపోయాయో, ది లాంగెస్ట్ డే కథానిక తెలియజేస్తుంది.
 • పెద్దకాపు అనే భూస్వామి దురహంకారం వలన పేదలైన కొండడు, చిలక జీవితాలు అర్థాంతరంగానే తనువు చాలించడం విచారకరం.
 • ఒంటరి వాడైన పైడయ్య రైల్వే పెట్రోల్ మెన్ గా పనిచేస్తూ ఎందరో ప్రయాణికులను రక్షించే ప్రయత్నంలో తాను అనుకోకుండా రైలు కిందపడి చనిపోవడం పాఠకులను ఆలోచింపచేస్తుంది.
 • ఈ కథల్లో వేట చేసే విధానము లో ఒకరు పొట్టకూటి కోసం వేట చేస్తే మరొకరు విలాసం కోసం వేట చేయడం గమనించవచ్చు.
 • ప్రాణాంతక వ్యాధుల వలన కుటుంబాలు ఏ విధంగా బలైపోతున్నాయో తెలుస్తుంది.
  వడ్డీ వ్యాపారస్తులు ఏ విధంగా సన్నకారు రైతుల యొక్క పొలాలను, కాజేస్తున్నారొ అల్లం శేషగిరి రావు గారు తమ అరణ్య ఘోష కథాసంపుటి ద్వారా మనకు తెలుస్తుంది.

5. పాదసూచికలు:

 1. మంచి ముత్యాలు కథా సంపుటి ముందుమాట 
 2. మంచి ముత్యాలు కథా సంపుటి ముందుమాట
 3. అరణ్య ఘోష కథా సంపుటి పుట.60
 4. పైదే పుట.96
 5. పైదే పుట.124
 6. పైదే పుట.169
 7. పైదే పుట.27
 8. పైదే పుట.80

6. ఉపయుక్తగ్రంథసూచి:

 1. నారాయణరెడ్డి, సి. (1999). ఆధునికాంధ్రకవిత్వం, సంప్రదాయములు-ప్రయోగములు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
 2. మోహన్ రావు,సజ్జా. (2015). సాంఘికోద్యమ రూపకాలు, విజయ నరసింహ పబ్లికేషన్స్, టెక్కలి, శ్రీకాకుళం.
 3. రామారావు, ఎస్.వి. (2017). తెలుగులో సాహిత్యవిమర్శ అవతరణ-వికాసములు, పసిడి ప్రచురణలు.
 4. లక్ష్మీకాంతం, పింగళి. (2002). సాహిత్యశిల్పసమీక్ష, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
 5. శేషగిరిరావు, అల్లం. (1980). మంచి ముత్యాలు కథానిక సంపుటి, మిత్ర సాహితి, విశాఖపట్నం .
 6. శేషగిరిరావు,అల్లం. (1996).అరణ్యఘోష కథానికసంపుటి, కుసుమ బుక్స్, విజయవాడ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]