headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797

10. ఆంధ్రగాథాలహరి: సామాజిక, సాంస్కృతికాంశాలు

Cinque Terre
డా. బి. నాగశేషు

సహాయ ఆచార్యులు
కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు, కర్ణాటక
సెల్: +91 9985509053. Email: b.nagaseshu47@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం: ప్రాచీనకథాసాహిత్యం ఎంతో విస్తృతమైంది. కథాకావ్యాలుగా అలనాడు అవతరించి, కథలు కథానికలుగా ఆధునికసాహిత్యంలోనూ అలరిస్తోంది ఈ కథాప్రక్రియ. సంస్కృతంతో పాటు ఇతర భాషలనుండి కూడా అనువదింపబడిన ఎన్నో కథలు, గాథలు చక్కని జనాదరణను పొందుతూ విశ్వవ్యాప్తమయ్యాయి. హాలుడు ప్రాకృతభాషలో సంతరించిన గాథాసప్తశతికి తెలుగులో వచ్చిన అనువాదాలలో పేరెన్నికగన్న “ఆంధ్రగాథాలహరి” లోని సామాజిక, సాంస్కృతికాంశాలను పరిశీలించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

Keywords: ప్రాచీనసాహిత్యం, గాథాసప్తశతి, ఆంధ్రగాథాలహరి, హాలుడు, సాంస్కృతకనేపథ్యం, సత్యనారాయణ, నాగశేషు

ఉపోద్ఘాతం:

ప్రపంచంలో అతి ఎక్కువగా అనువదింపబడి ముద్రింపబడిన గ్రంథాల్లో గాథాసప్తశతి రెండవది, పంచతంత్రంమొదటిది. తెలుగు వాళ్ళ సాంఘిక చరిత్ర శాతవాహనుల పరిపాలనతోనే ప్రారంభమవుతుంది. శాతవాహనులు ఆంధ్రులకు భృత్యులా లేక ఆంధ్రులు వేరే రాజవంశం వారై ఉండేవారా? ఆంధ్రులు శాతవాహనులకు సామంత రాజులా? అనేటువంటివి చాలా సందేహాలు ఇంకా సుడులు తిరుగుతూనే ఉన్నాయి. గాథ సప్తశతి క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన సంకలన గ్రంధం, సంకలన కర్త హాలుడు, హాలుడు కొన్ని గాథలను తానే స్వయంగా రాశాడు, ఇతను శాతవాహన రాజు, శాతవాహనులు తెలుగు రాజులు.శాతవాహన ఆస్థానంలో అనేకమంది కవులు ఉండే వారిని ప్రతీతి.

గాథాసప్తశతి మహారాష్ట్రప్రాకృతభాషలో రచింపబడిన గ్రంథం, వెబర్, వంటి పాశ్చాత్య పండితులను సైతం ఈ గ్రంథం ఎంతగానో ఆకర్షించింది. దీనికి కారణం నాటి జనజీవనం ఈ గాథలలో ప్రతిఫలిస్తుండటమే. క్రీ.శ. ఒకటో శతాబ్దం నాటికి లోకంలో ప్రాచుర్యంలో ఉన్న కోటి గాథలనుంచి ఏడువందల గాథలను ఎన్నుకున్నానని హాలుడు స్వయంగా చెప్పాడు. అప్పటి పల్లెజనుల ఆచారవ్యవహారాలు ఈ గ్రంథంలో వర్ణించబడ్డాయి.

గాథాసప్తశతి - తెలుగు అనువాదాలు:

ఈ గ్రంథంలోని కొన్ని గాథలను శ్రీనాథుడు తెలుగులోకి అనువదించాడు, అయితే రెండు మూడు పద్యాలు తప్ప పూర్తిగ్రంథం అలభ్యం. ఆధునికులలో శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, శ్రీ వాసిరెడ్డి వెంకటసుబ్బయ్య గారు, శ్రీ నరాల రామారెడ్డి, కోడూరి ప్రభాకర్ రెడ్డి, తెలుగులోకి అనువదించారు. ఈ పరంపరలో భాగంగా “ఆంధ్రగాథాలహరి” అనే పుస్తకాన్ని డి.వి.ఎం. సత్యనారాయణ గారు అనువదించారు.

గాథాసప్తశతి- సామాజిక సాంస్కృతికనేపథ్యం:

శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజభాష, ప్రజలభాష కూడాను, ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్నీ ఉన్నాయి. అయితే అప్పటికి తెలుగు ఇంకా పూర్తి పరిణిత చెందిన భాషగా అయి ఉండేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. గాథాసప్తశతిలో కనిపించే అత్త, అద్దం, లాంటి పదాలు చూస్తే తెలుగు అప్పటికే పరిమితి చెందిన భాషగా ఉందని చెప్పవచ్చు. “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్థం ఆంధ్రులు పలువురని, పలు జాతుల ప్రజలు కలిసిన వారిని ఇది సూచిస్తుంది.

అత్తాకోడళ్లసంభాషణలు:

గాథాసప్తశతిలో సామాజిక-సాంస్కృతికనేపథ్యం దండిగా ఉంది. అందులో కొన్ని విషయాలను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. ప్రతినిత్యం తోటపనిలో నిమగ్నమైన భర్త కొత్తగా పెళ్ళయిన పడుచుపెళ్ళాన్ని పట్టించుకోలేదని పడుచు భామ నిర్లక్షపు భర్తను గురించి చెప్పుకుంటూ-

“అతివ తోడ తరులకు దోహదము చేసి
కాయలుబ్బగ కాయింప కష్టపడును
గాని నిజదార కడుపున కాయ కొరకు
యత్నమొనరింపడేమి? యా హాలికుండు.” (ఆంధ్రగాథాలహరి, పుట. 2)

చేలో పంటలు బాగా పండాలని కోరుకుంటూ రాత్రింబవళ్లు పంటచేలోనే సమయాన్ని గడుపుతూ భార్యను నిర్లక్ష్యిస్తుంటాడు భర్త, మరి ఆమె కడుపులో కాయ ఎలా కాస్తుంది? అందువల్ల అత్తతోనేమో బిడ్డలు కాలేదంటే పోరు పడాలి, అందుకే అత్తతో ఇలా అంటుంది. ఇందులో రావి చెట్టు ప్రదక్షిణలు, తాయిత్తులతో నాటి ప్రజానీకం మూఢనమ్మకాల మీద ఆధారపడి ఎలా జీవితాన్ని గడిపేవారు అనే విషయాలన్నీ తెలుసుకోవచ్చు. తనకు కడుపులో కాయ గాయాలంటే చెట్లకు, పుట్లకు తిరగమని చెబుతుంటాడు భర్త. అంతేకానీ తనను చేరదీసిందిలేదు. బిడ్డలు కలుగలేదనే అపవాదు మోసే సగటు స్త్రీ ఆవేదనను మనం ఇక్కడ గమనించవచ్చు. నేటి ఆధునిక సైన్స్ అభివృద్ధి చెందిన లోకంలో బిడ్డలు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అయితే అప్పటి సమాజం బిడ్డలులేని తల్లిని గొడ్రాలిగా ఆడిపోసుకొనేది. ఇప్పుడైతే సరోగసి అనే అద్దె గర్భంలో కూడా ఉంది అందువల్ల మూఢనమ్మకాల జోలికి పోకూడదనే విషయంతో పాటు సాంసారికజీవితం కూడా ముఖ్యమని అర్థమవుతుంది. చేలో పంటలు పండాలని ఆశపడడంలో రైతు ఆశలు నిజమే అదే సమయంలో ఇల్లాలు కడుపులో కూడా కాయ కాయాలని ఆమె ఆశ కూడా నిజమే. ఈ రెండింటిని నెరవేర్చాల్సిన బాధ్యత మాత్రం భర్తదే.

పొయ్యిమండక ముసురుకు పొగలు నిండ
ఊది ఊది ఆమె పెదవులుబ్బిపోవ
మగడు జూచి ఈ రీతి చమత్కరించె
అగ్ని త్రాగుచుండెడు నీదు అధరసుధులు.” (అదే. పుట. 05)

అసలే వర్షం ఆపై కట్టలన్నీ తడిసిపోయాయి, సమయానికి వంట కాలేదంటే పతి ఏమంటారో అని సతికి, పొయ్యిమండక సతి ఏమంటుందో అని పతికి, ఇద్దరికీ లోలోపల గుబులు గానే ఉంటుంది. అప్పుడే ఆకలి మీద ఇంటికి వచ్చిన భర్త, భార్య స్థితిని చూసి తడిచిపోయిన కట్టెలతో సరిగా మండక ఇల్లంతా పొగ చుట్టుకుంది, ఊది ఊది ఆ ఇల్లాలు పెదవులు ఉబ్బిపోయాయి. అప్పుడుభర్త ఆమెబాధను మర్చిపోయేలా, “అగ్ని నీ అధరసుధలను తాగాలనుకుంటున్నాడో ఏమో” అంటున్నాడు. 

ఇక్కడ గమనించాల్సిందేమంటే వర్షం, కట్టెలు మండక ఆమె పడే ఇబ్బందిని భర్త కోపగించుకోకుండా కట్టెలు మండకపోవచ్చు కానీ, ఆ స్థితిని అనుభవిస్తున్న ఇల్లాలు కడుపు మాత్రం మండుతూనే ఉంది. మరి ఆ మంటను చల్లార్చాల్సిన బాధ్యత భర్త తీసుకోవాలి కదా, ఆమె స్థితిని ఆమెకే కవితాత్మకంగా చెప్పి చల్లార్చాడు. భార్య అలా తడికట్టెల పొగ మేఘాల మధ్య ఉండడానికి బాధ్యత తనదే అని అందుకే భేషజాలకు వెళ్లకుండా భర్తే చొరవతీసుకుని ఆమెను తియ్యని మాటలతో కవిత్వీకరించి కనికట్టుచేశాడు. భార్యా భర్తల అన్యోన్య దాంపత్యం అనేది గాథసప్తశతిలో మనం చూడవచ్చు.

భార్యాభర్తల అన్యోన్యదాంపత్యం:

తొలిచూరి గర్భవతికి ఏవేవో కోరికలు ఉంటాయని లోకప్రతీతి, ఆ గర్భవతి చుట్టూ సేరి అమ్మలక్కలు “చెప్పవమ్మా నీకు ఏమేమి కావాలో” అని అడగ్గా, ఆమె భర్త వైపు భారంగా చూసింది. అంటే భర్తే సర్వస్వం. అతనుంటే చాలు అన్నట్లుగా ఆ చూపుల అర్ధాన్ని మనం గ్రహించవచ్చు. అదొకరకమైతే భర్త ఆర్థిక స్థితిని తెలుసుకుని అందువల్ల కూడా తన కోరికలకు ఆర్థిక వనరులను భర్త చేకూర్చలేరని భార్య మనసులో భావించుకోవడం కూడా మనం అర్థం చేసుకోవచ్చు.

తోయజాక్షి యొకతె తొలిచూలు దాల్చంగ
అడుగు మేదివలయు? ననగ చెలులు
మగని ముఖము వంక మధురంబుగా జూచి
సిగ్గుతోడ నామె శిరము వంచె.” (అదే. పుట. 06)

భారతీయ స్త్రీల మనోగతం - గాథాసప్తశతి నాటికే పురుషుని గౌరవాన్ని స్త్రీ ఎంతగా కాపాడిందో తెలుసుకోవచ్చు. అది నేటి కాలానికి కూడా కొనసాగుతూ వస్తూంది. భారతీయ స్త్రీలు దాదాపు సాంప్రదాయకంగా వారి స్థితిగతులను తెలుసుకునే మసలుకుంటుంటారు. ఇంటిగుట్టు రట్టు చేయకూడదని ఎవరితోనూ పంచుకోరు. అది ఆనాటి కాలం నుంచి వస్తున్న ఆచారం. నేటికాలంలో కూడా ఇది మనం చూడవచ్చు.

“మంద మలయానిలమ్ములు మలయచుండు
కిసలయాస్వాద మత్తకోకిలలు కూయ
భ్రమర ఝంకార రవములే, భగ్న ప్రణయ
విరహగీతమ్ములని దోప, వెనుదిరుగుడు
పనులే ముఖ్యమని తలచి పయనమౌను.” (అదే. పుట. 28)

ఎప్పుడు చూసినా భర్త పని, పని అంటూ భార్యను పట్టించుకోకుండా వెళుతుంటే ఆ ఇల్లాలి మనసు ఎలా ఆరాటపడుతుందో తెలుసుకోలేకపోయాడు భర్త. అసలే చలికాలం భర్త తోడుగా ఉండాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది, అలాంటిది ఎప్పుడూ పొలం పనుల మోజులో పడి భార్యని విస్మరిస్తుంటే అలాంటి వాడితో వేగేదెలా అని నిట్టూర్చింది.

అలాగే ఎప్పుడూ పెళ్ళాం ముద్దులో పడిఉండే వారిని కూడా గాథాసప్తశతి ఒకింత హెచ్చరించింది.

“కొత్త పెండ్లాము మోజులో కూరుకొనియు
వేట మరచియు నిదురించు భిల్లు డొకడు
భుజము పై విల్లు గిరివోలె మోసికొనుచు
వెడలుచుండే భారంబుగా, వేట కొరకు.” (అదే. పుట. 36)

కొత్త పెళ్ళికూతురు మోజులో పడి వేట మరిచిన యువకుల్ని ఆ తల్లిదండ్రులు వారించడంతో తల్లిదండ్రుల పోరు పడలేక నాసిరకం బిల్లును భుజం మీద కొండను మోసినట్లు మూసుకుంటూ వెళ్తున్నాడంట. ఇష్టం లేని పనిని ఎలా చేస్తారో ఈ గాథవల్ల మనకు తెలుస్తుంది. పూర్తిగా పని మీద కానీ, పూర్తిగా భార్యాదాసులు కావడం గానీ రెండూ తప్పే అని ఈ గాథలవల్ల తెలుస్తుంది.

ఆధ్యాత్మికప్రబోధం:
వట్టి ఇసుక గోడ పదిలంబు గానట్లు
కమలధవుని యొక్క కరుణ లేక
పురుషయత్నమెంత పూర్ణంబుగానున్న
చక్కబడునె పనులు సత్వరముగ.” (అదే. పుట. 60)

మనిషి ఎంత శ్రమించినా దైవకృప కాసింత ఉండాలనేది ఆనాటికి ఈనాటికీ ఉవాచ. మనం శ్రమించకుండా దైవం మీదే ఆధారపడితే దక్కేది ఏమీ లేదు, కావున కష్టము ఉండాలి, కృప ఉండాలి. మనం చేసే పని మంచిదైతే దైవం, ప్రకృతి అన్నీ పగబట్టి మన కార్యాన్ని నెరవేరుస్తాయనేది మనం వింటూ ఉంటాం. అది నేటి కాలానికి కూడా వర్తిస్తుంది. ఇలాంటి అనేక విషయాలు గాథాసప్తశతి కాలపు జీవన విధానాన్ని భద్రంగా పదిలపరిచారు.

లోకరీతి - నీతి:
అధములైన వారి అక్రమార్జనమును
అధములైన వారే అనుభవింత్రు
పృధ్వియందుచూడ వేప పండ్లనెపుడు
కాకి తినుడు గాని ఘనుడు తినడు.” (అదే. పుట. 63)

అన్యాయంగా సంపాదించిన వారు అందలమెక్కుతున్నారు, వారు అక్రమంగా సంపాదించారని మనం కూడా అదే జాడపడితే మంచిది కాదు. నీచుడు ఎంత గొప్పగా ధన సంపాదన చేసిన అది నీచులే తింటారు కానీ ఘనులు తినరు. ఎంత కలమాగిన వేపపండు అయినా కాకులే తింటాయి గాని మిగతావి తినవు. పురుషార్థాలలో మొదట ధర్మ, అర్థ, కామ, మోక్ష, అని ఉండగా మొదటగా ధర్మానికి ప్రాధాన్యతనిచ్చారు. అందుకే “ధర్మోరక్షితి రక్షితః” అన్నారు.

ఫలభరములైన తరువులు వంగి నటుల
వినయముగ నుండు, సుజనుండు ధనముగలుగ
కలిమి పోయినన్ తల ఎత్తి నిలిచి యుండు
ఫలరహితవేళ వృక్షాగ్రభాగమట్లు.” (అదే. పుట. 68)

సంపదలు ఉన్నప్పుడు వంగి నడుచుకోవాలి, సంపద లేనప్పుడు కూడా తల ఎత్తి నిలబడాలి అనేది మనకు చెట్టును ఆదర్శంగా చూపుతూ ఈ గాథను వివరించారు. గుణవంతుడు సంపద ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఒకే రకంగా నిటారుగా ఉంటాడనేది ఈ గాథ యొక్క భావం. మనకు సిరి కలిగినప్పుడు ఒక రకంగా లేమి కలిగినప్పుడు ఒకరకంగా ప్రవర్తించకూడదు.

ముగింపు:

ఈ గ్రంథంలో పంటపొలాల వర్ణన, స్త్రీ పురుషుల సంబంధాలు, మనసుకు ఆహ్లాదించే అనేక విషయాలు ఈ గాథల్లో నిక్షిప్తమయ్యాయి. ప్రధానరసం మాత్రం శృంగారరసం, అయితే ప్రబంధాల లాగా ఎక్కడా శృతిమించలేదు. ప్రజల రోజువారి విషయాలకు సంబంధించినవే, ఇది ముక్తక గ్రంథం. తరువాతి కాలంలో సంస్కృతంలో ఆర్యాసప్తశతి, అమరకశతకం లాంటి గ్రంథాలు ఇదే పద్ధతిలో వచ్చాయి. గాథలు ప్రాకృతభాషలో ఉండటంతో తెలుగులో సామాన్యప్రజలకు వీటిని అర్థంచేసుకోవడం కష్టంగా ఉండేది. దీంతో టీకా తాత్పర్యాలు వచ్చాయి. ఈ రకంగా గాథల్లో అనేక రకాలైన విషయాలు తెలపబడ్డాయి. వ్యాసపరిధిని దృష్టిలో ఉంచుకుని  కొన్నింటిని మాత్రమే  చర్చించడమైనది.

మనిషికి కష్టసుఖాలు అనేవి సహజంగా లభించే సూర్యచంద్రుల లాంటివి, ఏది ఎప్పుడు వచ్చినా శాశ్వతంగా ఉండదు. అది తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు నడవాలి.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి, శాలివాహనగాథాసప్తశతీసారము, ఆంధ్రసారస్వత పరిషత్తు. హైదరాబాద్: 1964.
  2. ఆంధ్రగాథాలహరి, డి.వి.ఎం. సత్యనారాయణ, పూర్ణ ప్రింటర్స్, అద్దంకి: 2019.
  3. ఆంధ్రగాథాలహరి,75, ఆంధ్రభూమి, దినపత్రిక, మంగళవారం, 2-2018
  4. గంగాధర భట్ట (టీక ), గాథాసప్తశతీ. నిర్ణయసాగర్ ప్రెస్. ముంబై: 1911.
  5. బడిగేర, పి.బి., మహాకవి హాలన గాథాసప్తశతి. అభినందన ప్రకాశన, మైసూరు: 1991.
  6. బాబా, బొల్లోజు. హాలుని గాథాసప్తశతికి సొగసైన వ్యాఖ్యానం. ఆంధ్రజ్యోతి, 2016.
  7. లక్ష్మీనరసింహ శాస్త్రి, గట్టి. గాథాసప్తశతి. సాహితీ సమితి, తెనాలి: 1956.
  8. వెంకటరావు, భట్టు. గాథాసప్తశతిలో గృహస్తజీవనసౌందర్యం. ఆంధ్రజ్యోతి, 2018.
  9. సంస్కృతగాథాసప్తశతి, మంజునాథ గ్రంథావలి. రాష్ట్రీయ సంస్కృత సంస్థానం. నవదేహలి: 2010.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]