headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797

8. మల్లవరపు జాన్ “సాంసన్ - డెలీల” నాటకం: సామాజికసందేశం

Cinque Terre
సి. హెచ్. ఉమారాణి

అధ్యాపకురాలు
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,
గజ్వెల్, సిద్దిపేట, తెలంగాణ
సెల్: +91 7036472509. Email: umarani7885@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం: ఇరవయ్యో శతాబ్దంలో తెలుగు పద్యనాటకాల రచన, ప్రదర్శన, ఆదరణలు విశేషంగా కొనసాగాయి. పౌరాణిక, చారిత్రక, సాంఘికేతివృత్తాలతో నాటకపరంపర జనాకర్షణే మూలస్తంభంగా అలరారింది. సందేశాత్మకనేపథ్యంతో వెలువడే రూపకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలుగు రంగస్థలంపై పాశ్చాత్యప్రభావంతో అధునాతన, వైవిధ్యమైన కథావస్తువులతో నాటకాలు రూపుదిద్దుకొంటూ ఊరూరా ప్రదర్శనలకు నోచుకున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీయమైన భాషాపదజాలం, పాత్రలు, క్రైస్తవ పురాణగాథల ఆధారంగా పద్యనాటకంగా మల్లవరపు జాన్ రచించిన “సాంసన్-డెలీల” నాటక రచనానేపథ్యం, ఇతివృత్తం, పాత్రచిత్రణ, ప్రత్యేకతలను అనుశీలిస్తూ, ఈ నాటకం అందించే సామాజికసందేశాన్ని ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: రూపకం, పద్యనాటకం, సాంసన్, డెలీలా, ఫిలిప్తీయులు, ఇశ్రాయేలీయులు, జాన్.

ఉపోద్ఘాతం:

తెలుగు సాహీతి చరిత్రలో ఎందరో కవులున్నారు వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్కశైలితో సాహిత్య సృజన ఉంటుంది. ఈ కవులలో అటు అగ్ర వర్ణాలకు చెందిన కవులుంటారు. ఇటు వెనుకబడిన (దళిత) వర్గాలకు చెందిన కవులున్నారు. దళిత వర్గాలకు చెందిన కవులలో చాలామంది మంచి సాహిత్యాన్ని, కవిత్వానికి సృష్టించి చరిత్రకెక్కిన వారు ఉన్నారు. అలా చరిత్రకెక్కిన కొద్దిమందిలో మల్లవరపు జాన్ ఒకరు. జాన్ వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేశారు. వాటిలో నాటకం కూడా ఒకటి. నాటకానికి భారతీయ సాహిత్యంలో ఏంతో ప్రాధాన్యత ఉంది. “నాటకము దశవిధరూపకాలలో ఉత్తమమైన రూపకము.”1 (తెలుగు నాటక వికాసము – పోణంగి శ్రీ రామఅప్పారావు, పుట:15) అటువంటి ఉత్తమమైన ప్రక్రియలో వీరు ’సాంసన్ - డెలీలా’ అనే నాటకాన్ని 1967 లో రచించారు. ఈ పద్యనాటకము ఎందరో ప్రముఖ సాహిత్యకారుల ప్రశంసలను అందుకున్నది.

ఈ సాంసను డెలీలా గద్య పద్యములతో కూడిన నాటకం ఈ నాటకం 5 అంకములుగా విభజించారు. ఈ నాటకం ‘సాంసన్ చరిత్ర బైబిల్ ప్రాచీన నిబంధనలో న్యాయాధిపతులు అనే గ్రంధంలో 13,14,15,16 ప్రకరణాలలో ఉంది. ఈ దృశ్యకావ్యానికి నాయకుడు సాంసను, నాయకురాలు డెలీల. మల్లవరపు జాన్ ఏ రచనను చేపట్టిన సాహిత్యం కన్నా ముందు వారి ప్రతిభ దర్శనమిస్తుంది. ఆ కోవకు చెందిన రచనలలో పుణ్య పురుషుడు, విశ్వప్రకాశము, అతుకుల బ్రతుకులు, సరసవినోదిని, సూక్తిశతకము మొ.వి గలవు. ఈ వరుసలోనిదే ‘సాంసను - డెలీనా ‘అనే నాటకం.

సాంసను - డెలీలా రచనానేపథ్యం:
సాంసను, డెలీలా మూలము పరిశుద్ద బైబిల్ గ్రంథములోని పాత నిబంధనలో న్యాయాధిపతులు అన్న గ్రంధములో 13,14,15,16 అధ్యాయములో ఉంది. ఈ నాటకంలో జాన్ చూపించిన సంయమనము ప్రశంసనీయము పాత్రల వైవిధ్యము, కవితా గాంభీర్యము, కల్పన ప్రౌఢిమా, చతుర సంభాషణా నైపుణ్యము ఇందులో వినూత్న ధోరణిలో సాగుతుంది.

ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్య బద్దవైరము ఉంది. ఫిలిష్తీయులు అధికార బలముతో ఇశ్రాయేలీలను ఆక్రమించి వారిని చిత్ర హింసలు పెడతారు. వారి ఆస్తులను దోచుకుంటారు. వారి దాస్య విమోచన కోసం యెహోవా దయవలన ఒక ఇశ్రాయేలీల స్త్రీకి సాంసను అనే ఒక బలశాలి పుడతాడు. అతడు వేశ్యా లోలుడై తనకు లభించిన శక్తినంతా పోగొట్టుకున్నా, తరువాత తిరిగి భగవంతుడు అనుగ్రహించిన శక్తితో చివరకు ఫిలిప్తియులను తుదముట్టించి, తాను చనిపోవడము ఇందులోని కథ. దీనిని కవి 5 అంకాల నాటకంగా రచించాడు..

ఇతివృత్తం:
సత్యవాది ఫిలిప్తీయుడు. అతడు తన జాతి వారైన ఫిలిప్తీయులు ఇశ్రాయేలీయులను బాధిస్తుంటే చూడలేక అడ్డుకున్నాడు. అందుకు వారు ఆగ్రహించి జైల్లో పెట్టి హింసించారు అతని దేశాలాపములతో ప్రధమాంకం ప్రారంభమవుతుంది.
సంతానం కోసం మనోరమ యెహోవాను ప్రార్థిస్తుంది. దేవదూత ప్రవేశించి ప్రభువు కరుణించాడు. నీకు సింహ బల సంపన్నుడైన కొడుకు పుడతాడు. అతడు మీకు స్వతంత్రం తెస్తాడు అని, అతని విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు చెప్పిపోతాడు. మనోరమ ఈ సంగతి భర్తకు చెప్పింది. ఇద్దరూ ఆనందించారు. స్వామి ఆజ్ఞ ప్రకారం వారికి కొడుకు పుట్టాడు. అతనికి సాంసను అని పేరు పెట్టారు. నీవు కారణ జన్ముడవు. జాతిని కాపాడు నాయనా! అని అర్ధించారు. కర్తవ్య బోధచేశారు సంసను బాధ్యతలను గుర్తిస్తాడు.

అదే సమయానికి అటుగా వస్తున్న కొందరు ఆయుధధారులైన ఫిలిస్తీయులను చూసి, కోపోద్రిక్తుడై-

“దుష్టులారా! రండి! రండి! మీ కండలను జీల్చి కాకుల వైచెద –
పరమ దుర్మార్గులారా! మీ పాప ఫలము
పండినందున నా బారి బడితిరిపుడు
పరుల బాధించు మీ రక్త పాత మందు
మునిగి తేలెద మా జాతి ముక్తి నొంద” (సాంసన్ – డెలీల నాటకం, మల్లవరపు జాన్, పుట:16)

అంటూ కోపంతో వారినందరిని మొండి చేతులతోనే చంపి వేశాడు. వారి వస్త్రాలన్నీ ఒలిచి వాళ్ళ రాజ్యానికి పంపిస్తాడు.

సాంసను తిమ్నతు పట్టణానికి వెళ్ళాడు. ఉపదనములో సరోజ అనే అవివాహితను పాము నుంది రక్షించాడు. ఆమె అందానికి ముగ్దుడయ్యాడు సాంసను, సరోజల పెండ్లి వైభవంగా జరిగింది. అక్కడ జరిగిన మనస్పర్థల వల్ల ఫిలిప్తియులు అతని పొడుపు కథల రహస్యాన్ని తన భార్య ద్వారా తెలుసుకున్నారని గ్రహించి ఆమె మీద కోపంతో విడిచి వెళ్ళిపోతాడు. తరువాత మరలా భార్య కోసం వచ్చే సమయానికి ఆమెను వేరొక పురుషునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆమె తండ్రి. ఆ కోపంతో అనేక నక్కలను పోగు చేసి వాటి తోకలకు నిప్పు అంటించి, ఫిలిప్తియుల పొలాలలోకి విడిచిపెడతాడు.
తర్వాత ఒక వేశ్య ఇంటిలో తలదాచుకుంటాడు. ఆమె సహాయంతో అతనిలో ఉన్న బలానికి కారణం తెలుసుకొని అతనిని బలహీనుడిని చేసి, బంధిస్తారు. వారు అతని కళ్ళు పీకి, కొరదాలతో హింసించి, వారి దేవత దాగోనుకు బలి ఇవ్వాలనుకుంటారు. ఫిలిప్తియులంతా కూడుకొని ఉన్న ఆ దేవాలయానికి రెండు ప్రధాన స్తంభాల మధ్య కట్టివేయబడతాడు. అదే అదునుగా భావించి, చివరిసారిగా దేవుడిని తలచుకొని తిరిగి శక్తిని పొందుకొంటాడు. ఆ బలంతో ఆ స్తంభాలను కూల్చివేస్తాడు. అక్కడ ఉన్న తనతో సహా అందరూ మరణిస్తారు.

సాంసను - డెలీలా నాటకం: కథాసంగ్రహం:
ఇందలి కథావస్తువు మన దేశానికి చెందినది కాదు. మన సంస్కృతికి సంబంధించినది కదు. మన భాషకు సంబంధించినది కాదు. అంతకు మించి జాన్ ఇందులో భారతీయ సంప్రదాయ పద్దతులనూ పాటించలేదు. కొన్ని పేర్లు మాత్రమే మార్చారు. అయినా సరే వ్రాసిన పాతికేళ్లలోపే నాలుగు వందలపైన ప్రదర్శనలకు నోచుకుంది. ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నది. అందుకు కారణం ఒక్కటే కవి ఇందులో అడుగడమునా తెలుగు సంప్రదాయమును పాటించటమే. తెలుగు దనము,తెలుగు వాతావరణాన్ని కవి అడుగడుగునా ప్రదర్శించి ఇది మన కథేనని అనిపించే విదంగా నాటకాన్ని రూపొందించి ప్రదర్శించి పాఠకులందరిని ఆకట్టుకోగలి.

సాంసను - డెలీలా నాటకం ప్రత్యేకతలు:

కవి కల్పనల సృష్టి :

మూలములో పేర్లు లేని పాత్రలను తాను సృష్టించిన పాత్రలకు తెలుగు పేర్లు పెట్టి నాటకానికి తెలుగు ధనము తెచ్చారు. మూలంలో మానోహ, అతని భార్య, సాంసను, ఫీలిప్తియుల కుమార్తె (అంటే సాంసను భార్య), ఆమె తండ్రి, డెలీలా పాత్రలు మాత్రమే ఉన్నాయి. కథా గమనము సాఫీగా నడవడానికి జాన్ క్రైస్తవుల మనోభావాలకు అనుగుణమైన కొన్ని సహాయక పాత్రలను సృష్టించారు.

మూలంలోని సాంసను తల్లికి పేరు లేదు. మన చరిత్ర ప్రభావములతో కవి ఆమెకు మనోరమ అన్న పేరు పెట్టారు. ప్రపంచాన్నే ప్రభావితం చేసిన గాంధీ ప్రభావముతో అటువంటి పాత్రనే సృష్టించాడు. ఆ పాత్రకు గాంధీ ఆయుధమైన సత్యమును స్పురించే విధంగా సత్యవాది అన్న పేరు పెట్టాడు. అదేవిధంగా మంగలి లింగన్న పాత్రను సృష్టించారు. కథకు అనుగుణంగా కొన్ని ఘట్టాలను కూడా కల్పించారు. సాంసను సరోజను పాము నుండి కాపాడటం కూడా కవి చేసిన కల్పనయె. మూలములో అతడు ఆమెను చూసి, ఇష్టపడినట్లుగా మాత్రమే ఉంటుంది. కాబట్టి రచయిత సన్నివేశాన్ని తన సృజనాత్మకతతో కల్పించినట్లు తెలుస్తుంది.

“నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు లాలన చేయుము. లేని యెడల మేము అగ్ని వేసి నిన్ను, నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసెదము. మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్ము పిలిచితిరా“ (పరిశుద్ధగ్రంథం-న్యాయాధిపతులు 14వ అధ్యాయం 15వ వచనం) అని మూలంలో ఉంటే ఈ నాటకంలో మాత్రం కొద్దిగా మార్చి సరోజతో ఆమె భర్తను చంపుతామని బెదిరించి రహస్యం తెలుసుకున్నట్లుగా మార్చారు.

ఇవే కాక నాటకీయతకు అడ్డు తగిలే మూలంలోని కొన్ని భాగాలను రచయిత తొలగించారు. ఈ విధంగా మూలముతో చిన్న చిన్న మార్పులు చేసి ప్రధాన కథకు భంగం కలిగించకుండా కవి ఈ రూపకాన్ని రచించారు.

తెలుగు కవుల సాహిత్యం- అనుకరణ:

తెలుగు సాహిత్యంలో ఏందరో కవులు తమ అద్భుతమైన కవితా రచన వైశిష్ట్యంతోపాఠకులను ఆకట్టుకున్నారు. వారు తమ అనంతర కవులకు మార్గదర్శకులయ్యారు. వారి సాహిత్యంలో కూడా కొన్ని కొన్ని పద్యాలు జనావళి మనసులలో ప్రత్యేక స్తానాన్ని పొందుకున్నాయి. అటువంటి కవుల పద్యాలను అనుకరిస్తూ జాన్ కూడా కొన్ని పద్యాలను సందర్భోచితంగా ఉపయోగించారు. సాంసను తిమ్నాతు పట్టణానికి వెళ్ళే సందర్భంలో ఆ పట్టణాన్ని చూసి ఇలా పలికాడు.

“అదె! తిమ్నాతు పురంబు! తత్సుర సువర్ణాక్రాంత దేవాలయం
బదిగో! అల్లదె రత్నరంజితపతాకానీక సంచాలనం
బదె సర్దారుల మందిరం బదియె న్యాయ స్థాన, మత్యద్భుతం
బొదలించెన్, తరుషండమండిత సుగంధోద్భూత విఖ్యాతమై” (సాంసను డెలీల నాటకం – పుట:19)

ఇలా తిరుపతి వెంకట కవుల ‘అదిగో ద్వారకా, ఆలమందలవిగో ..’ పద్యానికి అనుకరణగా రాశారు. ఇలాంటివి పలు చోట్ల కనిపిస్తాయి.

నాటకం-పాత్రలు:

సాంసను, డెలీలా నాటకంలో ప్రధానంగా నాలుగు పాత్రలు కనిపిస్తాయి. అవి: 1. సాంసను పాత్ర, 2. డెలీలా పాత్ర, 3. సరోజ పాత్ర , 4. సత్యవాద పాత్ర

పాత్రలు మూలములో కథ కథానుగుణంగా సాగిపోతాయి. కాని పాత్రల స్వభావాన్ని, లక్షణాలను కాని, ఎక్కడా ప్రస్తావించడు. భారతీయ పురాణం పాత్రల లాగా క్రైస్తవ పురాణ పాత్రలు కూడా గంభీరంగా ఉంటాయి. కాని ఎక్కడ బహిర్గతము కావు కాని నాటకములలో పాత్రల స్వభావము తప్పని సరిగా కంపించాలి. అభినయములోను వాచకములోనూ ఇవి బహిర్గతమౌతాయి. ఇది విషాదాంతనాటకము, అందువలన ఇందలి పాత్రలన్నీ చంచల స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఇందలి ప్రధాన పాత్ర సాంసను. అతను విషాదాంతనాయకుడు, విషాదాంత నాయకునిలో భావోద్రేకాలు తక్కువుగా ఉంటాయి. ఆశ్చర్యం కలిగించే ఘనత కలవాడై ఉంటాడు స్థిర స్వభావము ఉండదు.

సాంసను- డెలీలా - సామాజిక సందేశం:

‘సాంసను-డెలీలా’ నాటకము రూపకములోని కథా మూలములో విపులముగా ఉన్న ఈ కథ చాలా వరకు క్రైస్తవ సంప్రదాయానికి అనుగుణంగా మత విధేయంగా వర్ణించబడింది. పరిశుద్ద గ్రంధ కథలలో నాటకీయత ఉండదు. ఈ ప్రత్యేక ప్రాధాన్యం గల పరిశుద్ద గ్రంధంలోని గాథలను ఛందోబద్దం చేయడం కత్తిమీద సాము వంటిది. అయినా జాన్ మాస్టార్ మూలాలకనుకూలంగా కొన్ని సన్నివేశాలను, పేర్లను, కల్పించి రచన చేశారు. జాన్ సాంసను కథను చాలా జాగ్రత్తగా రూపకంగా మలిచి గొప్ప పేరును పొందిన నాటకం ఇది. ఈ నాటకం ద్వారా రచయిత క్రైస్తవ సాంప్రదాయ కథను తెలుగు వారికి అనుకూలం మలిచిన తీరు కనిపిస్తుంది. ఆయా పాత్రల ద్వారా ఆనాటి వ్యక్తుల స్వభావ చిత్రణ, సంప్రదాయం కనిపిస్తుంది. కొన్ని అద్భుత సంఘటనలు వాస్తవికతకు దూరంగా ఉన్నా సహజంగా అనిపిస్తాయి. ఉదాహారణకు సాంసను దేవాలయాన్ని మొత్తం తన చేతులతో పడగొట్టడం, నక్కలను పట్టుకొని తోకలు అంటించడం మొదలయినవి. భార్య అయినా వేశ్య అయినా ఎవరకీ రహస్యాలను చెప్పకూడదనే విషయాన్ని, చెప్తే జరిగే పరిణామాలను ఈ కథ ద్వారా తెలియజేశారు. తన జాతి రక్షణ కోసం పుట్టిన వాడు తన కర్తవ్యం మరచిపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియజేశారు.

ఉపసంహారం:

శ్రీ జాన్ తొలి ముద్రిత రచన సాంసను డెలీలా పద్యనాటకము. ఈ నాటకం ఐదు అంకములో రూపొందించిన పద్నాలుగు రంగాలనూ గ్రాంథిక భాషలో వెల్లడించినాడు. సందర్బోచితమైన కీర్తనలు, పద్యములు ఈ నాటకమున కలవు. ఇశ్రాయేలీయుల తెగకు చెందినవాడు సాంసను, ఫిలిస్తియులకు తెగకు చెందినది డెలీలా. వీరిరువురి మద్య ప్రణయ మేర్పడినది. ఈ విషాదాంత ఇతివృత్తంలో చిక్కదనము, సంభాషణలలో పదును లేకపోతే నాటకము తెలిపోతుంది. సాంప్రదాయ నాటకాలను ఇవి అడ్డగించవు. అందువలన భాసుని లాగా నిడివి తక్కువ గల సంభాషణాలతో అర్థవంతమైన పలుకబడులతో నేర్పుగా జాన్ - సాంసను -డెలీలా అన్న విషాదాంత నాటాకాన్ని రచించారని చెప్పవచ్చు.

పాదసూచికలు:

  1. తెలుగు నాటక వికాసము – పోణంగి శ్రీ రామ అప్పారావు, పుట:15
  2. సాంసన్ – డెలీల నాటకం మల్లవరపు జాన్, పుట:16
  3. పరిశుద్ధ గ్రంధం -న్యాయాధిపతులు 14 వ అధ్యాయం 15 వ వచనం
  4. సాంసను – డెలీల నాటకం -మల్లవరపు జాన్, పుట:19 

ఉపయుక్తగ్రంథసూచి:

  1. ప్రతాపరెడ్డి, సురవరం.  ఆంధ్రుల సాంఘికచరిత్ర. సాహిత్య వైజయంతి, హైదరాబాద్: 1950.
  2. శ్రీరామ అప్పారావు, పోణంగి. తెలుగు నాటకవికాసము. శివాజీ ప్రెస్, సికింద్రాబాద్: 2012.
  3. పరిశుద్ధ గ్రంథం, BSI, బెంగుళూరు. 2014. 
  4. జాన్, మల్లవరపు, సాంసన్ – డెలీల నాటకం. వెన్నెల ప్రచురణ, గుంటూరు: నవంబర్ 2018.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]