headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797

6. పల్లిపట్టు నాగరాజు కవిత్వం: అనుశీలన

Cinque Terre
కె. అమృత జ్యోత్స్న

పరిశోధకురాలు, తెలుగువిభాగం
విక్రమసింహపురి విశ్వవిద్యాలయం
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌.
సెల్: +91 9490428866. Email: amrutajyothsna@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం: తెలుగు సాహిత్యంలో వచనకవిత్వం గణనీయమైన స్థానంలో ఉంది. రాయలసీమ ప్రాంతంలో వెలువడే వచనకవిత్వానికి చక్కని పదును, ఆదరణ ఉన్నాయి. ప్రజల కష్టాలను, వాస్తవిక విషయాలను కవిత్వీకరించి, సమాజస్థితిగతుల్ని బేరీజు వేస్తూ, ప్రశ్నిస్తూ, ప్రజల్ని జాగృతం చే్సే కవితాధోరణులు ఆధునికకాలంలో విస్తృతమయ్యాయి. తెలుగుసాహిత్యాన్ని, వచనకవితాప్రక్రియను పరిచయం చేసి, రాయలసీమప్రాంత కవిత్వాంశాలను చర్చించడం, కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత పల్లిపట్టు నాగరాజు కవిత్వాన్ని పరిచయంచేసి, ఆ కవితావిష్కరణనేపథ్యాన్ని, ప్రత్యేకతలను విశ్లేషించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

Keywords: వచనకవిత, దళితకవిత్వం, రాయలసీమ, మాండలికం, యాలైపూడ్సింది, పల్లిపట్టు, అమృత

ఉపోద్ఘాతం:

పల్లిపట్టు నాగరాజు సాహిత్యం గురించి తెలుసుకొనే ముందు తెలుగు సాహిత్యం గురించి, తెలుగు కవిత్వం గురించి, తెలుగు వచన కవిత్వం గురించి, ఇంకనూ రాయలసీమ వచనకవిత్వం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

తెలుగు సాహిత్యం:

“Litterae” అనే లాటిన్ పదం నుండి ఏర్పడినదే సాహిత్యం. సాహిత్యం అనగా అనేక “పదాలతో సాన్నిహిత్యమే” తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మీకంలోనూ, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగు వారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. సాహిత్యమనే పూలమాలకు దారం వంటివి ప్రక్రియలు. లిఖిత సాహిత్యం, మౌఖిక సాహిత్యంలు అనే రెండు రకాల సాహిత్యాలున్నాయి. లిఖిత సాహిత్యమున్న ప్రతి భాగంలోనూ ప్రక్రియలు ఉంటాయి.ప్రక్రియలు లేని లిఖిత సాహిత్యాన్ని మనం కనీసం ఊహించలేము. సాహిత్య వీరాన గతిలో ఇతిహాసాలను గురించి తొలి తొలుత ప్రస్తావించాలి. ఇతిహాస రచనతో తెలుగు కవిత్వ నాందీ గీతాన్ని ఆలపించిన మహాకవి నన్నయ.

తెలుగు సాహిత్యము అనేది ఇలా శాసన రచనలో ప్రారంభమైన పద్య రచన నన్నయతో కావ్య రూపాన్ని ధరించి తిక్కన, ఎర్రన, శ్రీనాధుడు, పెద్దన లాంటి పలువురు మహాకవుల రచనలతో పరిపుష్టిమై నిలిచింది. ఇతిహాస, కావ్య, ప్రబంధ, యక్షగాన, జానపద యుగాలతో ప్రయాణాన్ని కొనసాగించింది. శతకాలుగా, అవధానాలుగా నిలిచిపోయింది. ఆధునిక ఆంగ్లేయ సాహిత్యీ సంపర్కంతో నాటకం, నవల, కథా, వ్యాసంగా తెలుగు సాహిత్యం విస్తరిస్తూనే ఉంది. ఎన్నో ప్రక్రియలకు, ఎన్నో సృజనాత్మక రచనలకు వేదికగా నిలిచింది తెలుగు సాహిత్యం.

వచన కవిత్వం:

ఆంగ్లంలో “Free verse”, “Verselibre” లను దృష్టిలో ఉంచుకొని తెలుగులో వచన కవిత్వం పుట్టుకొచ్చింది. వచన కవిత్వానికి స్వేచ్చా స్వాతంత్ర్యం ప్రాణపదమైన లక్షణాల గురించి -
“చందోరహితమైన కేవల వచనంలో భావ లయ ప్రధానంగా పలికే కవిత్వానికి వచన కవిత్వమని” స్థూలం గా నిర్వచనం చెప్పవచ్చు”. - అరిపిరాల విశ్వం. “వచన గీతానికి ప్రాణ పదలక్షణం గమన వైవిధ్యం. ఇది సంభాషణ లోని, యాసలు, కాకువులూ, ఉచ్చారణ విశేషాల మీద ఆధారపడి ఉంటుంది” అని శ్రీ శ్రీ పేర్కొన్నారు.

రాయలసీమ వచన కవిత్వం: పల్లిపట్టు స్థానం:

రాయలసీమలో కవులకు కొదవలేదు. ఎంతమంది ఉంటారో ఎంతమంది కొనసాగుతారో తెలియదుగానీ కాలమనే ఖడ్గాన్ని ధరించినవారు. తమ కవిత్వంతో ఆనందం కల్గిస్తారు. అరచేతితో భవిష్యత్ ను చూపిస్తారు. తమ కవిత్వంతో స్పూర్తినిస్తారు. 

పల్లిపట్టు నాగరాజు తన సాహిత్యంలో ఎక్కువగా వచనకవిత్వంను ఆశ్రయించారు. రాయలసీమవాసి కావడం చేత తన కవితలలో, కథలలో ఆముద్రిత రచనలలోనూ రాయలసీమ మాండలికాలు ఎక్కువగా ఉంటాయని భావించవచ్చు.

దళిత సమస్యల్ని, నేటి మత రాజకీయాల్ని, దేశభక్తి విషయాల్ని, సీమ బహుజనుల వీధి భాష ద్వారా కవిత్వంను వ్రాయగల ప్రతిభాశాలి “పల్లిపట్టు నాగరాజు”. సీమసమస్యల్నే ఇతివృత్తాలుగా స్వీకరించి ఏ ఇతర ప్రాంతాల తెలుగు వచన కవులు చేయని కృషిని వీరు చేశారు. 2022 కేంద్రసాహిత్య అకాడమి యువ పురస్కార్ గ్రహీత పల్లిపట్టు నాగరాజు.

యాలైపూడ్సింది కవితాసంపుటి - కవితావిశ్లేషణ:

"ఆమె కొందరికి చేపలు పాపమ్మ
కొందరికి తూలు పాపమ్మ
నేను మాత్రం అసలు పేర్తో ‘రుక్కమ్మత్తా’ అంటే
ఆ యత్తా బలేనవ్వి నా దొంగనాబట్టా” అని
ముదిగారంగా నా బుగ్గగిల్లి
ఒక మెత్తాడో, కరవాడో చేతికిచ్చి కాల్చుకు తినమంటే
నాముఖం సిగ్గుతో సందమామై పోయేది." (రుక్కత్త, పేజి నెం.46 )

“రుక్కత్త” కవిత చదువుతున్నప్పుడు చేపలు అమ్ముకునే ఒక సాధారణ మహిళ గురించి, ఆమె పలకరింపులోని ప్రేమాభిమానాల గురించి చదువుతుంటే మలినంలేని మనసుల్ని వారు చూసినట్టున్నట్టుగా వారి కవితలలో నాకు కనిపిస్తున్నట్టు ఉంటుంది.

“యాలై పూడుస్తా వుంది
ఎంతకాలం ఈ ఏగులాట” అంటూ సాగుతూ.....
“వారగా బొండప్పా
యాలై పూడ్సింది
వాకిలి చిమ్మాలా
కల్లాపుజల్లాలా” ( యాలైపూడ్సింది పేజి నెం. 88)
అంటూ ముగించే కవితలో ఓ స్త్రీ ఆవేదనను కోపాన్ని, ఈసడింపును, ఆవేశాన్ని అన్నింటినీ ఒకే కవితలో చూపించిన తీరు అద్భుతం.

“కత్తి కన్నా కలం గొప్పది” అని నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివినట్టు గుర్తు. అది నిజం చేసినట్టే ఉంటుంది. ఎవరైనా “యాలై పూడ్సింది” నందలి కవితలు చదివారంటే ఇంకా కర్రి సూరీడు – నల్లచందమామ’, ‘సపాయమ్మలు’, ‘రుక్కత్త” ఈ కవిత్వాలలో స్త్రీ పాత్రల వర్ణన బాగుంది.

“పిచ్చుక వాలిన కిటికి ', ‘నిషేధ స్వరం’, ‘దారి’, ‘నేను పలానా’, ‘నిద్రరాని కళ్ళు’, ‘చిగురు కొమ్మల పై సూర్యోదయం’, ‘వరండాలో వాన” ఈ కవిత్వాలలో తనే ఓ పాత్ర లా మాట్లాడిన తీరు – వర్ణన బాగుంది.

“గెనింపై మానాయన కయ్యకి
కళ్ళు అప్పగించి నడుస్తుంటే
నడికొండ్రిలో నిలబడి
నన్నేచూస్తున్నపల్లెద్దుకి గిట్టలో
మడక తెగిన నొప్పితో నెమో
కళ్ళల్లో నీటిచారా ఒక్కొక్కటి కదులుతున్నాయి”. రాయలసీమ నుడికారాన్ని కళాత్మకంగా నెలబెట్ట గలిగిందీ కవిత్వం.

"ప్రశ్నించే నా చేతులు విరిచేసినట్టే
ఎదిగే దాని కొమ్మలు విరవకండి
మాట్లాడే నా గొంతును కత్తిరించినట్టే
చిగురించే దాని రెమ్మల్ని చిదిమేయకండి
దయసేసి
నన్ను నేల కూల్చినట్టే చెట్టుని కూల్చకండి
ఇంతకీ
నా సమాధెక్కడనేగా మీ సందేహం? !
ఈ నేలను ఎక్కడ తవ్వినా
అక్కడ నా సమాధి మీతో సంభాషిస్తుంది”.
పై కవిత్వం ద్వారా పల్లిపట్టు నాగరాజు అభ్యుదయ భావాల్ని గమనించవచ్చు. సమాధి కూడా ప్రశ్నిస్తూ సమాజాన్ని జాగృతి చేయడం అభ్యుదయ రచయితలకే చెల్లుతుందనిపిస్తుంది.
“జంతువు గురించి మాట్లాడే ముందు
మనిషిని గురించి మాట్లాడాలి
మాట్లాడే ప్రతి మాటా
మాయ మాటలు గాకుండా
మాటలు చర్చ జరగాలి”
(పేజి నెం.99 చర్చ)

నిజమే కదా! ఎవరైనా గృహ ప్రవేశం చేసినపుడు ఓ పశువును పిల్చి ఇంటి లోపాలకి రానిస్తారు. కానీ అదే రోజు ఓ దళితుడు నీరు అడిగినా బయటే ఉండూ అంటూ నీరు తెచ్చి దోసిట్లో పోయడమో లేకపోతే నీరు లేదు పో పొమ్మని చెప్పడం ఇంకా కొన్ని చోట్ల తారస పడే సన్నివేశాలే.ఈ ఆధునిక కాలంలోనూ ఇంకనూ ఇలాంటివి ఎన్ని చూడాలో? వీటికి ముగింపు ఉందో లేదో గానీ, ప్రశ్నించే వారికి మాత్రం ముగింపు రాదు. ఇలాంటి సంఘటనలు ఎదురైనపుడు నాకు అనిపిస్తుంది. ఒక పశువుకిచ్చే విలువ ను ఒక మనిషికి మాత్రం ఇవ్వడం లేదు మరి ఇది కాదనలేని నిజం కదా, కాదా?

కేవలం సీమ నుడికారంతో నింపేయడమే కాకుండా అనేక కవితల్లో సీమ కరువు, సీమ రైతు, సీమ శ్రమ జీవులు గా కనబడతారు.

ఇది వానకు అంటరాని నేల
చుట్టూ నదులు పారుతున్నా
ఇక్కడ కరువు ప్రవహిస్తూ ఉంటుంది.
చుక్కరాలని ఈమట్టిలో
దుక్కమే నవ్వుతుంటది
దుక్కమే ఏడుస్తుంటది
దుక్కమే ఎక్కిరిస్తుంటది..” (పేజి నెం. 62. కరువు ఋతువు)
అంటూ కరువే ఋతువుగా సాగే రాయలసీమ ప్రాంతం గురించి “వాన అంటరాని నేల” అంటూ వాపోయారు పల్లిపట్టు.

“వాళ్ళు ప్రవహిస్తున్నారు’, ‘మట్టి పొరల కింద” వంటి కవిత్వం ద్వారా రైతుల వర్ణన కలదు. కరువే ఋతువుగా ఏలే ఈ రాయలసీమలో కుటుంబాల గురించి, సీమ బతుకు చిత్రణను చూడవచ్చు.
“చుక్కరాలని ఈ మట్టిలో
దుక్కమే నవ్వుతుంటది
దుక్కమే ఏడుస్తుంటది”...... అంటూ వ్రాసిన “యాలై పూడ్సింది” కవిత్వంలో సీమ రైతు బ్రతుకు కనబడుతుంది.

“కుశాల’, ‘అడిగానని జెప్పు” ఈ కవిత్వాలలో స్నేహితుల పాత్రణ వాటి చిత్రణ కలదు.
“నా మిత్రుడా!
ఆకలితో ఆవురావమంటున్న
నా ఎండినడొక్కల్లో కాలే కడుపులో అపుడపుడు
అంత కవణమై కూచున్న 
అమ్మలాంటి బందిలి పోలమ్మని అడిగాననిజేప్పు”.
ఇంటిలో నిట్టాడికి కట్టి వచ్చిన పాల వంటి పసితనాన్ని
ఎంగిలి పూసి తుడిసి ఎక్కాలు రాసిన రాతిపలకని
దిబ్బలో చింత చెట్టు వుయ్యాలని
పెరట్లో పూలచెట్టుని , దొడ్లో దూడ మూతి ముద్దులను
మళ్ళీ మళ్ళీ మనసారా ముద్దుపెట్టుకోవాలని
ఆశగా ఎదురుచూస్తా ఉండానని చెప్పు
ముదిగారంగా చెప్పు”
(పేజి నెం.42: అడిగానని జెప్పు)
అనే కవితలో బతుకు తెరువుకై నగరాల్లో జీవిస్తున్నప్పటికీ మనం మరిచిపోయిన కొన్ని సంగతులను, మనుషులను, చిన్ననాటి దృశ్యాలను నెమరు వేసుకొంటున్నట్టుగా అందరినీ పలకిస్తున్నట్టూ “అడిగానని జెప్పు” అంటూ రచించిన తీరు పాఠకుల హృదయాల్ని లోలోపల కదిలిస్తుండనడంలో సందేహం లేదు.

బాహ్య ప్రపంచంలో జీవిస్తున్న మనల్ని మనకే తెలియకుండా “మనో” ప్రపంచంలోకి మెల్లగా లాక్కేలుతుంది ఈ కవిత.

"చీ...చీ...
ఎన్ని తూరులైనా గుండునో,
మీసాల గెడ్డాన్నయితే గొరుగుతున్నామేగానీ
మీ బుర్రలోపల బురదను కడగలేకపోతున్నామే"
అంటూ "మంగలిన్యాయ" కవితలో (పుట-78) జాతిసమైక్యతగా ఉండాలని కుల ఊబిలో ఇరుక్కోకండి అంటూ శరీర కల్మషం లేకుండా చేసినట్లే మానసికంగా కూరుకు పోయిన కుల మత బేధాలు అనే కల్మషాల్నీ పారద్రోలండి అంటూ దళిత సమస్యల్ని చెప్పారు.

“ఆవు భయం’, ‘దూడమూతి వాసన’, ‘పిచ్చుకవాలిన కిటికీ” ఈ కవిత్వాలులో జంతుపాత్రల వర్ణన కలదు.

దూడమూతి వాసన
---------------------------
చిన్నప్పుడు తమ్ముడితో కలిసి
కొట్టంలో లేగలతో ఆడుకున్నట్టు
ఇప్పటికీ దూడలతో ఆడుకోవడమంటే
అడ్డొల్లోబిడ్డనేసుకుని
పాలిస్తూ పొయ్యూదే
తల్లి ఒడిలో పాలబుగ్గల్ని ముద్దుపెట్టుకున్నట్టు
పొద్దన్నే బడికి పోతా పోతానో
సందకాడ సేదబావిలో నీళ్లు తెస్తానో
దొడ్లో పేడెత్తుతూనో
గొడ్లకాడ గెడ్డివూడుస్తూనో
ఏ దూడమూతిని ముద్దుపెట్టుకున్నా
మధురమైన వాసనేదో ముక్కుకొసల్ని తాకుతాది
మనలా మనుషులైతే
కులం వాసనో మతం వాసనో వచ్చేదేమో
కసువుతినే పశువుబిడ్డలు కదా ఒకటే వాసన
కవుడూ కుచ్చడం తెలీని మూగజీవాల ప్రేమ వాసన.! (పుట.123)

’ఆవుభయం’, ‘దూడమూతి వాసన’, ‘పిచ్చుక వాలిన కిటికీ” వంటి జంతువుల్ని వస్తువులుగా చిత్రీకరించడం జరిగినది.

"ఆకాశాన్ని శోధిస్తూనే
అఖాతల్లోకి ముడుచుకుంటూ
శిఖరాలెక్కుతూనే
శిథిలాల్లోకి జారిపోతూ
ఏవేవో తరంగాల అలలపై
ఈదుతున్న సమూహాలు
సైబరక్వేరియంలో చేపలైన జీవితాలు"అంటూ
అక్వేరియంలో గోల్డ్ ఫిష్ ల మాదిరిగా

నేటితరం ఫోన్ కి, వాట్సాప్ కీ, ‘ట్విట్టర్’ కి బానిసలుగా మారి సమూహంలో ఉన్నా ఒంటరిగా బ్రతుకుతున్నారు అని, వారి పసితనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి ఉందని, “నేటి బాలలే రేపటి పౌరులు" అనే నినాదం మరచిపోరాదని నేటివర్తమానం విస్మరిస్తే ఈ బాలల భవిష్యత్తు అగాధంలోకి జారిపోతుంది అంటూ "ఈ మనిషి తనపు చేపపిల్లల్ని ఎలా భద్రపరచుకోవాలి?" అంటూ వాపోయారు పట్టు.

పల్లిపట్టు- కవిత్వనేపథ్యం:

రాయలసీమ గ్రామీణ వాతావరణంలో  రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన పల్లిపట్టు నాగరాజు. ఆ మట్టి పరిమళాల్నే అక్షరాలుగా అద్దాడు. రాయలసీమ కవులు రాయలసీమ సమస్యల్నే ఇతివృత్తాలుగా స్వీకరించి ఏ ఇతర ప్రాంతాల తెలుగు వచన కవులు చేయని కృషిని వీరు చేశారు. రాయలసీమ ప్రాంత వాసులైన వేమన వారి పద్యాలతో, అన్నమయ్య కీర్తనలలోనూ, వీరబ్రహ్మం రచనల లోనూ కొన్నింటిలో మనకు బలమైన ధిక్కార స్వరం కనిపిస్తుంది. ఈ ధిక్కార స్వరాన్ని వారసత్వంగా పుచ్చుకొని తను కవితల రూపంలో “యాలై పూడ్సింది” గా మనముందుకు తీసుకు వచ్చారు పల్లిపట్టు నాగరాజు.

“యాలై పూడ్సింది” రచనకు దోహదం చేసిన అంశాలుగా మనము వారి ఊరు, కులం, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు... ఇలా అనేకం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కొత్తగా వచ్చే ఆధునిక కవులకు వారిలో దాగివున్న కవి హృదయాన్ని తట్టిలేపే ఆయుధంగా “యాలైపూడ్సింది” చెప్పవచ్చు. ఇది ఒక్కటి చదివితే చాలు బహుమూల సమస్యల్ని ఒక్క సారి గా తడిమి చూసినట్టు ఉంటుంది. చిన్న వయసులో కేంద్రసాహిత్యఅకాడమీ యువపురస్కార్ రావడంతో ఈ కాలంలో తెలుగు సాహిత్యలోకంలోకి ప్రవేశించే, ప్రవేశించిన వారికి స్పూర్తినీయులు పల్లిపట్టు.

“చర్చ” కవితలో “జంతువుల గురించి మాట్లాడే ముందు మనిషిని గురించి మాట్లాడాలి. మాటల చర్చ జరగాలి” అంటూ సాంఘీక అంశాల గురించి దళిత పీడిత బ్రతుకుల గురించి వర్ణించిన తీరు అమోఘం. దళిత ప్రజల చీకటి బ్రతుకుల్ని జనాల్లోకి తీసుకొచ్చే అక్షర సూరీడు పల్లిపట్టు నాగరాజు.

నిజమే కదా ఎవరైనా గృహ ప్రవేశం చేసినపుడు ఓ పశువును పిల్చి ఇంటి లోపలకి రానిస్తారు, కానీ అదే రోజు ఓ దళితుడు నీరు అడిగినా బయటే ఉండూ అంటూ నీరు తెచ్చి దోసిట్లో పోయడమో లేకపోతే నీరు లేదు పో పొమ్మని చెప్పడం ఇంకా కొన్ని చోట్ల తారస పడే సన్నివేశాలే. ఈ ఆధునిక కాలంలోనూ ఇంకనూ ఇలాంటివి ఎన్ని చూడాలో? వీటికి ముగింపు ఉందో లేదో గానీ, ప్రశ్నించే వారికి మాత్రం ముగింపు రాదు. ఇలాంటి సంఘటనలు ఎదురైనపుడు నాకు అనిపిస్తుంది. ఒక పశువుకిచ్చే విలువ ను ఒక మనిషికి మాత్రం ఇవ్వడం లేదు మరి ఇది కాదనలేని నిజం కదా, కాదా?". 

“భారదేశప్రజలు నా సహోదరులు అంటూ ప్రతిజ్ఞ చేయడం కాదు, సాటి మనిషిని మనిషిగా చూడని చోట జంతువధ గురించి కాదు మనిషికున్న మనసువ్యధ గురించి చర్చ జరగాలి” అంటూ ఆవేదనను వ్యక్తపరిచారు. అంబేద్కరు వ్రాసిన భారతరాజ్యాంగప్రవేశికలో చెప్పినట్టు “సర్వసత్తాక’, ‘సామ్యవాద’, ‘ప్రజాస్వామ్య’, ‘గణతంత్ర” మైనదిగా సమసమాజస్థాపన చేయడం అవసరమన్నాడు. “సమసమాజం సాధ్యం కానపుడు, చర్చలు విఫలం అయినపుడు ముగింపు యుద్దమే” అంటూ కవిత ముగించారు. అందుకే ఏమో రైతులు సైతం తమ శ్రామిక కష్టఫలితం చేతికి అందనపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై బైటాయిస్తారు కాబోలు.

ఈ ఆధునిక కాలంలో యువత “పేస్ బుక్’, ‘వాట్సాప్’, ‘ట్విట్టర్”లలో “ఈ” వలయాలలో చిక్కుకొని ఎలా తమ జీవితాల్ని వినాశనం చేసుకొంటున్నారో సమూహంలో ఉన్నా ఫోన్ చేతిలో పెట్టుకొని ఎలా ఒంటరిగా గడిపేస్తున్నారో, మనిషి ఒక మనిషి దగ్గరగా ఉన్నప్పటికీ ఈ టెక్నాలజీ ఈ దగ్గరి తనాన్ని పదివేల మైళ్ళ దూరంగా నెట్టేస్తోంది” అంటూ... భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనిషి తనపు చేపపిల్లల్ని ఎలా భద్రపరచుకోవాలి?” అంటూ ప్రశ్నించే తీరు నేడు అందరూ ఆలోచించేలా చేస్తోంది.

కవి ఆత్మీయత - శైలి:

నాగరాజు సాహిత్యం అద్భుతం. వాస్తవంగా, కరుణరసపూర్తితంగానూ, చురకలంటించేలా, మనసును చైతన్య పరిచేలా, హృదయ ఆహ్లాదకరంగానూ సాగుతాయి. కేవలం రాయలసీమ ప్రాంత సమస్యల్నే కాక ప్రతి బతుకులోని బహుమూలల్ని స్పురించేలా కవిత్వం వ్రాసినట్లు ఆ ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
గ్రామీణ వాతావరణంలో దళిత రైతు కుటుంబంలో పుట్టడం చేత కాబోలు తన కవితా సాహిత్యంలో బహుజన సామాజిక నేపధ్య అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఓ పూలదండలో రకరకాల పూలున్నట్లు పల్లిపట్టు వ్రాసిన “యాలైపూడ్సింది” లోనూ భావ కవితలతో, అభ్యుదయ కవితలతో, దళిత కవితలతో, ప్రేమ కవితలతో, స్త్రీ కవితలతో, ఆధునిక కవితలతో, రాయలసీమ మాండలికాలతో, పల్లె పదాలతో, విమర్శనాబాణాలతో, ప్రేమానురాగాల పలకరింపులా, మట్టి పరిమళాలతో తెలుగు సాహిత్యానికి పల్లిపట్టు నాగరాజు ఇచ్చిన ఓ పూలమాలగా అభివర్ణించవచ్చు.

నాగరాజు - కవితా దార్శనికత:

నాగరాజు దృష్టి విశ్వవ్యాప్తమైనదిగా చెప్పవచ్చు. ప్రాంత సమస్యలు దగ్గరనుంచి రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలే కాకుండా అంతర్జాతీయ సమస్యలు కూడా తన కవితా సాహిత్యంలో కవితలుగా మారాయి.

ఎందఱోకవులు వస్తుంటారు, పోతుంటారు. ఎన్నో పుస్తకాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కొందరు కవులే నిలబడతారు. కొన్ని పుస్తకాలే పాఠకుల మదిలో చెదరని ముద్రలేస్తాయి. అలా అందరి మనస్సులో చేరేలాగా వ్రాసిన కవితా సంపుటే “యాలైపూడ్సింది”.మొదటి కవితా సంపుటి “యాలైపూడ్సింది” తో ఉగాది పురస్కారంతో పాటు, కేంద్ర ప్రభుత్వ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న పల్లిపట్టు నాగరాజు నేటి యువ కవులకు ఆదర్శప్రాయులు.
తొలి పుస్తకంతో చెరగని ముద్రవేసిన పల్లిపట్టు నాకు మలి పుస్తకం పైన ఆరాటాన్ని రేపుతున్నాడు. కవిత్వ పట్టు, లోగుట్టు తెలిసిన యువ కవి రాజు నాగరాజు తన కవితాక్షరాలే ఆయుధాలై సమాజ మార్పు కోసం కృషి చేసే ఈ దళిత సూరీడు తెలుగు సాహిత్యంలో వెలుగొందాలని ఆశిస్తున్నాను.

పల్లిపట్టు కవిత్వం - భాష:

“యాలై పూడ్సింది” అనే శీర్షికతోనే మనకు అర్థమౌతుంది సీమభాష అని. చిత్తూరు జిల్లా వాసి కావడం చేతకాబోలు ఆమట్టివాసనను అక్షరాలుగా మలచి తమ ప్రాంతం పట్ల గల మక్కువని చూపించారు. పద్య లక్షణాలైన మాత్రా, చంధస్సులను వాపిదులుకుంటూ గేయగుణం అధికంగా ఉండి పాడుకోవడానికి వీలుగా ఉండటం చేత పల్లిపట్టు నాగరాజు వ్రాసిన ఈ కవితల్ని మనం వచన కవితలుగా వర్గీకరించవచ్చు.

రాయలసీమ వ్యక్తి కావడం చేత రాయలసీమ మాండలిక పదాలతో కొనసాగుతున్నాయి ఈ కవితలన్నీ. పల్లిపట్టు నాగరాజు తమ కవిత్వాలలో సరైన నాయకత్వం లేని స్థితిని, సిద్ధాంతాల లేమిని ఇంకా తన ఊరి గురించి, “అడినానని జెప్పు” కవిత్వం ద్వారా తన ఊరి గురించే కాదు తన సామాజిక మూలాల గురించి మరిచిపోని కవి.

ముగింపు:

ఒక్కో అన్నం మెతుకుని పదాలుగా పేర్చి కవిగా సాగుతున్న పల్లిపట్టు నాగరాజు తన అనుభూతిలో మిగిలిపోయిన వ్యక్తుల్ని ఒక్కొకొక్కరిగా బయటకి తీస్తూ ప్రతిపాత్రకి జీవం పోసి అనుభూతి కవిత్వాలుగా వ్రాసాడు. పల్లిపట్టు నాగరాజు కవిత్వంలో ప్రధాన వస్తువు రాయలసీమ కరువు కాటకాలే అని నేను గమనించినాను. ఇంకనూ వారి కవితలలో రాయలసీమలో వర్షాభావం, పంటలు ఎండిపోవడం, పశువులకు గడ్డిలేక పోవడం, రైతులు ఆకలితో అల్లాడడం, త్రాగడానికి నీరు లేకపోవడం, రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోవడం, రైతులు వర్షం చుక్క కోసం ఎదురు చూడటం, రాయలసీమ లోని రాజకీయాలు, రాయలసీమ ప్రాంత ప్రజల ప్రేమానురాగాలు – పలకరింపులు, దళిత సమస్యలు ఇలా అనేక అంశాలును ఇతివృత్తాలుగా నిర్వహించడం మనకు కన్పిస్తుంది.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. రామమోహన్ రాయ్, కడియాల. తెలుగు కవితావికాసం. ఆంధ్రప్ర్తదేశ్ సాహిత్యఅకాడమి, హైదరాబాద్: 1982.
  2. రామారావు, సంపత్ కుమార్, వచన పద్యం - లక్షణచర్చ,  నాగార్జున ప్రింటర్స్, ముషీరాబాద్.
  3. రంగనాథాచార్యులు, కె.కె., ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు. ఆంధ్ర సారస్వత పరిషత్.

యాలైఫూడ్సింది కవితా సంపుటి పై పలువురి అభిప్రాయాలు-పత్రిక సమీక్షలు:

  1. "అక్షర సూరీడు", పల్లిపట్టు(సాక్షిపత్రిక, 25-08-2022)
  2. "నిర్భయ గొంతుకై ప్రశ్నలెక్కు పెట్టిన యాలైఫూడ్సింది"(నవ తెలంగాణ, 28-08-2022)
  3. "కవిత్వ పట్టు తెలిసిన పల్లీపట్టు" (సృజన నేడు, 25-12-2022)
  4. "దళిత విప్లవజమిలి నేత పల్లిపట్టు”, కేతిరెడ్డి యాకుబ్ రెడ్డి (భూమిపుత్ర27-7-2022)
  5. "సీమభాషకు కావ్యగౌరవం”, Dr. రాధేయ (డా. ఉమ్మడిశెట్టి రాధేయ అవార్డు వ్యవస్థాపకులు.)
  6. "మట్టి మాటలే యాలై పూడ్సింది".(సాహిత్య ప్రస్తానం పత్రిక ఏప్రిల్ 2021)

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]